Table of Contents
Alekhya Chitti Pickles.. సోషల్ మీడియాతోనే ఎదిగి, ఆ సోషల్ మీడియా వల్లే పాతాళానికి పడిపోవడమంటే ఏంటో తెలుసా.? ఔను, పచ్చడైపోయింది.! ‘డైమండ్ రాణి’ భాషలో చెప్పాలంటే, ఇత్తడైపోయింది.!
అక్కా చెల్లెళ్ళు కలిసి ఓ పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా, ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ని ప్రమోట్ చేశారు.
ఇది మామూలు వ్యాపారం కాదు.! ఓ రేంజ్లో వర్కవుట్ అయ్యింది. అంతలా వర్కవుట్ అవ్వాలంటే, ఎంతలా కష్టపడి వుండాలి. నిజంగానే, చాలా కష్టపడ్డారు.
పచ్చడిలో ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది.? కారం ఎక్కువైతేనో.? అన్నీ కుదిరితేనే, పచ్చడి బావుంటుంది. ఏ మాత్రం, తేడా వచ్చినా అంతే సంగతులు.
Alekhya Chitti Pickles.. క్వాలిటీ మాత్రమే కాదు.. రెస్పెక్ట్ కూడా.!
ఫుడ్ బిజినెస్‌లో ప్రతి రోజూ క్వాలిటీ ముఖ్యం.! అస్సలేమాత్రం క్వాలిటీలో రాజీ పడకూడదు. అదే సమయంలో, ‘రెస్పెక్ట్’ కూడా చాలా చాలా ముఖ్యం.
ఏ వ్యాపారంలో అయినా సరే, కస్టమర్ దేవుళ్ళను బాగా చూసుకోవాలి. అంటే, వాళ్ళని గౌరవించాలి. భక్తితో పూజించేలా వుండాలి. అప్పుడే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది.

అలేఖ్య చిట్టి పికెల్స్ కూడా బహుశా అలానే, కస్టమర్లను దేవుళ్ళలా చూసి వుండొచ్చు. లేకపోతే, ఇంత సక్సెస్ ఎలా సాధ్యమవుతుంది.?
సక్సెస్ అవడం గొప్పే.. కానీ, ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప.! కస్టమర్లను బూతులు తిడితే ఎలా.? అలా ఎలా తిట్టాలనిపించింది.?
ఆకాశం నుంచి.. అదఃపాతాళానికి..
ఒక్క దెబ్బకి, అంతా కుప్పకూలిపోయింది.! ఓ కస్టమర్ మీద అసభ్యకరమైన రీతిలో సంభాషణలతో విరచుకుపడింది అలేఖ్య చిట్టి పికెల్స్.
అంతే, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఒక్క ఆడియో క్లిప్.. అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ బూతులేంటి.? ఛీ.. అసలు నువ్వు ఆడదానివేనా.? అని అంతా అవాక్కయ్యారు.

‘ముష్టి పచ్చడి కొనలేనోడివి, నీ పెళ్ళానికి బంగారం ఎలా కొంటావ్.?’ అని హేళనగా మాట్లాడటమే కాక, అందులో బూతుల్ని చొప్పించారు అలేఖ్య చిట్టి పికెల్స్ నిర్వాహకులు.
అంతే, సోషల్ మీడియా భగ్గుమంది.. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏకంగా డిస్కషన్లే పెట్టింది. ఇదో తరహా భావ దారిద్ర్యం.. అనుకోండి.. అది వేరే సంగతి.
క్షమాపణతో ముగిసిపోయే వివాదమే..
ఒక్క క్షమాపణ.. ఒకే ఒక్క క్షమాపణ చెప్పేసి వుంటే, విషయం ఇంత పెద్దదయ్యేది కాదు.! కానీ, అహంకారం ప్రదర్శిస్తున్నట్లున్నారు అలేఖ్య చిట్టి పికెల్స్ నిర్వాహకులు. అందుకే, ఇంత ట్రోలింగ్.!
ముందే చెప్పుకున్నట్లు.. చాలా కష్టపడే ఈ స్థాయికి వచ్చి వుంటారు. కానీ, కూర్చున్న కొమ్మని నరుక్కుంటే ఎలా.? ఆత్మ విమర్శ చేసుకోవాలి అలేఖ్య చిట్టి పికెల్స్ నిర్వాహకులు.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
ఆడ పిల్లలు.. కష్టపడి ఎదిగారు.! ఆ కష్టాన్ని అర్థం చేసుకుని అయినా, ట్రోలింగ్ ఆపితే మంచిది.! వ్యాపార రంగంలో ఏ అండదండలూ లేకుండా, స్వయంకృషితో ఎదగడం చిన్న విషయం కాదు.
టైటిల్ ‘బూతు పచ్చడి’ అని పెట్టాల్సి వచ్చినందుకు.. ఒకింత ఇబ్బందిగానే వున్నా, ఆడియో క్లిప్ విన్నాక.. తప్పనిపించలేదు.!