Home » షాకైన కాజల్‌: ‘హద్దు’ దాటేసిన ముద్దు

షాకైన కాజల్‌: ‘హద్దు’ దాటేసిన ముద్దు

by hellomudra
0 comments
Kajal Aggarwal Chota K Naidu Mehreen Kaur Pirzada Kavacham

ఫలానా సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఓ దర్శకుడు నా చేతిని అసభ్యకరంగా పట్టుకున్నాడని ఓ నటి ఆరోపిస్తే, ఇంకో సినిమా షూటింగ్‌ టైమ్‌లో హీరో తన బ్యాక్‌ పార్ట్‌ని జుగుప్సాకరంగా తడిమేశాడని ఇంకో హీరోయిన్‌ వాపోయింది.

మీ..టూ..’ అంటూ తారా లోకం, తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో మహిళల్ని ‘టచ్‌’ చేయాలంటే ఎంత జాగ్రత్తగా వుండాలి?

కానీ, సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు, అలవోకగా అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ నడుము పట్టేసుకున్నాడు. అంతే కాదు, ఆమెని ముద్దాడేశాడు. దాంతో షాక్‌ అయ్యారంతా.

‘కవచం’ వేడుకలో హంగామా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas) హీరోగా రూపొందుతోన్న ‘కవచం’ (Kavacham) సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), మెహ్రీన్‌ కౌర్‌ (Mehreen Kaur Pirzada) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టీజర్‌ (Kavacham Teaser Launch) రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది.

ఈ ఫంక్షన్‌లోనే (Kavacham Teaser Release Function( కాజల్‌ని (Kajal Agarwal) ఛోటా కె నాయుడు (Chota K Naidu) ముద్దు పెట్టుకున్నాడు. అప్పటిదాకా సరదా సరదాగా సాగిన వేడుక ఒక్కసారిగా గుంభనంగా తయారైంది.

మరోపక్క, హీరోయిన్‌ కాజల్‌ మరో హీరోయిన్‌ అయిన మెహ్రీన్‌ పిర్జాదాకి విషెస్‌ చెబుతూ, కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. కో-స్టార్‌ని అభినందించే క్రమంలో కాజల్‌, తన సీనియారిటీని చాటుకుందిక్కడ.

షాక్‌ గురైన మెహ్రీన్‌ కౌర్‌

కాజల్‌ అగర్వాల్‌ అంటే, మెహ్రీన్‌ కంటే చాలా సీనియర్‌. సీనియర్‌ హీరోయిన్‌తో ఓ సినిమాటోగ్రాఫర్‌ ఇలా ప్రవర్తించడం మెహ్రీన్‌ కౌర్‌కి షాక్‌ ఇచ్చింది. ఆ సమయంలో కాజల్‌, హుందాగా ప్రవర్తించడం మెహ్రీన్‌కి మరింత ఆశ్చర్యం కలిగించిందట.

అంతే మరి, వేడుకను డిస్టర్బ్‌ చెయ్యకూడదని కాజల్‌ చేసిన పెద్ద ఆలోచన మెహ్రీన్‌నే కాదు, చాలామందిని ఆశ్చర్యపరిచింది. కాజల్‌ హుందాతనం గురించే ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతుండడం గమనార్హం.

ఛోటా కె నాయుడు ‘కవరింగ్‌’

కాజల్‌ అగర్వాల్‌ లాంటి స్టార్స్‌ని సామాన్యులు ముద్దు పెట్టుకునే అవకాశమే లేదని సంగీత దర్శకుడు తమన్‌ చెప్పాడట. దాంతో, ఛోటా కె నాయుడు, ‘అదేం లేదు..’ అని నిరూపించేందుకే, ఇలా చేశాడట.

ఛోటా కె నాయుడు వివరణ ఎంత ఫన్నీగా వుందో కదా! సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌గా సినీ పరిశ్రమలో ఛోటా కె నాయుడుకి మంచి పేరుంది. ఆయనెందుకు ఇలా సంయమనం కోల్పోయారో ఎవరికీ అర్థం కావడంలేదు. అయితే, ఆ సంఘటన ఫన్‌ కోసం చేసింది తప్ప, పైత్యంతో చేసింది కాదని ఛోటా కె నాయుడు తరఫున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అదీ నిజమే. ఛోటా కె నాయుడు చాలా సినిమాలకు పనిచేశాడు. ఆయన ఎంతో గౌరవాన్ని సినీ పరిశ్రమ నుంచి సంపాదించుకున్నాడు. ఎప్పడూ అతని విషయంలో బ్యాడ్ రిమార్క్స్ లేవు సినీ పరిశ్రమలో. ఫన్ కోసమే చేసినా.. ఇదొక వివాదంగా మారే అవకాశాలైతే లేకపోలేదు.

కాజల్‌.. ఎలా స్పందిస్తుందో మరి.!

ప్రస్తుతానికి కాజల్‌ ఈ ఎపిసోడ్‌ని ‘ఫన్నీగా’ తీసుకుంది. ఊహించని ఘటనతో షాక్‌కి గురైన కాజల్‌ అగర్వాల్‌, ఆ తర్వాత కూడా ఎలాంటి హడావిడి చేయలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని, నవ్వేసింది. ఫంక్షన్‌ని డిస్టర్బ్‌ కానివ్వలేదు.

కానీ, ఆ తర్వాత పరిస్థితిని ఖచ్చితంగా విశ్లేషించుకుంటుంది. ‘కవచం’ ప్రమోషన్స్‌ సందర్భంగా పదే పదే కాజల్‌కి, ఈ ముద్దు అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం లేకపోలేదు. సో, కాజల్‌ ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు మానసికంగా సిద్ధమవ్వాల్సి వుంటుంది.

‘మీ..టూ..’ అంటూ కాజల్‌ ముందుకొస్తే.?

తమిళ సీనియర్‌ నటుడు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఓ హీరోయిన్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసుల విచారణనూ ఎదుర్కొంటున్నాడు.

ఓ షూటింగ్‌ సమయంలో తనతో అర్జున్‌ (Arjun Sarja) అసభ్యకరంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్‌ (Shruthi Hariharan) అనే హీరోయిన్‌ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.

మరి, కాజల్‌ కూడా ‘మీ..టూ..’ (MeToo MeTooIndia) అంటూ ఛోటా కె నాయుడిపై న్యాయపోరాటానికి దిగితే.? ఆ పరిస్థితి వస్తే మాత్రం, తెలుగు సినీ పరిశ్రమలో కలకలం తప్పదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group