Table of Contents
రాఖీ సావంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐటమ్ బాంబ్, ఓవరాక్షన్‌కి పెట్టింది పేరు. ఎక్స్‌పోజింగ్ చేయడంలో అయినా, హద్దులు దాటి డైలాగులు పేల్చడంలో అయినా ఈమె తర్వాతే ఎవరైనా. ఏ విషయాన్ని అయినా వివాదం చేయగల దిట్ట రాఖీ సావంత్. ఇప్పుడీ హాట్ బాంబ్, ఆసుపత్రిలో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నోరు జారి, నడుము విరగొట్టుకుంది రాఖీ సావంత్ (Rakhi Sawant). నోరు జారితే, నడుము విరిగిపోవడమేంటి.. అంటారా.! అసలు విషయంలోకి వెళదాం.
ప్రొఫెషనల్ రెజ్లర్‌తో పోటీనా.?
రెబల్ తనీయా అలియాస్ తనీయా బ్రూక్స్ (Rebel Tanea Brooks) అమెరికాకి చెందిన రెజ్లర్. ఇండియాలో రెజ్లింగ్ (Wrestling) పోటీల్లో పాల్గొనేందుకు వచ్చింది రెబల్ తనీయా. ఆమెతో సరదాగా ఛాలెంజ్ చేసింది రాఖీ సావంత్. ‘ఆమె రింగ్‌లో ఛాంపియన్ ఏమో.. నాలా డాన్స్ చేయగలదా.? నాలా ఆమె డాన్స్ చేస్తే, ఆమెతో రింగ్‌లో పోటీ పడ్తా..’ అంటూ రాఖీ సావంత్ రెచ్చిపోయింది. రెజ్లర్ రెబల్ తనీయా, డాన్స్ చేసింది. దాంతో, రాఖీ సావంత్.. ఆమెతో రింగ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యింది. అదీ అసలు కథ.

రాఖీ సావంత్‌ని ఎత్తి పడేసిన రెబల్ తనీయా
ప్రొఫెషనల్ రెజ్లర్ కదా.. అలవోకగా రాఖీ సావంత్‌ని ఎత్తి పడేసింది రెబెల్ తనీయా (Tanea Brooks). ఈ క్రమంలో రాఖీ సావంత్ తన నడుం విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది. నడుం విరిగాక, కాస్సేపు బాగానే కన్పించిన రాఖీ సావంత్, ఆ తర్వాతే అసలు ఓవరాక్షన్ మొదలు పెట్టింది. రింగ్‌లో అప్పటిదాకా డాన్స్ వేసిన రాఖీ సావంత్, ఎప్పుడైతే రెబల్ తనీయా తనను ఎత్తి పడేసిందో, అక్కడి నుంచి డ్రామా షురూ చేసింది. తనూశ్రీ దత్తా దగ్గర డబ్బులు తీసుకుని, తనకు హాని తలపెట్టిందంటూ రెబల్ తనీయాపై ఆరోపణలు చేసింది.
రాఖీ – తనూశ్రీ గొడవేంటంటే..
‘మీ..టూ..’ అంటూ, బాలీవుడ్‌లో కలకలం రేపింది తనూశ్రీదత్తా. పదేళ్ళ క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఆ సమయంలో నటుడు నానా పటేకర్, తనతో అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తనూశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెల్సిందే. దీంతో, నానా పటేకర్ సినిమాల్లో ఛాన్సులు కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆ ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకి తనూశ్రీ దత్తా గుడ్ బై చెప్పేస్తే, అందులో రాఖీ సావంత్ నటించింది.. అదీ ఐటమ్ సాంగ్‌లో. తనూశ్రీ దత్తాని లెస్బియన్ అంటూ రాఖీ సావంత్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాన్సెన్స్.. పబ్లిసిటీ స్టంట్స్ చేయ్యొద్దు!
తనూశ్రీ దత్తా (Tanushree Dutta) దగ్గర డబ్బులు తీసుకుని, తనపై దాడి చేసిందంటూ రాఖీ సావంత్ చేసిన ఆరోపణల్ని రెబల్ తనీయా (Tanea Rebel) కొట్టి పారేసింది. ‘ఊహించని సంఘటన అది. ఆమె నాతో ఛాలెంజ్ చేసింది. రెజ్లింగ్ సందర్భంగా గాయపడింది రాఖీ సావంత్ (Rakhi Sawant). ఆమె గాయపడినందుకు బాధగా వుంది. కానీ, ఆమె ఆరోపణల్లో నిజం లేదు. ఆమె గురించి అందరికీ తెలుసు. ఇండియా నన్ను అర్థం చేసుకోగలదు..’ అని రెబల్ తనీయా సోషల్ మీడియాలో పేర్కొంది.
ఏదిఏమైనా, తనకు చేతకాని పని విషయంలో ఓవరాక్షన్ చేసి, ఛాంపియన్‌ని సవాల్ చేసినందుకు రాఖీ సావంత్‌కి తగిన శాస్తే జరిగిందని అందరూ అనుకుంటున్నారు.
