Rashmi Gautam Health Problem.. బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? రష్మి కొన్ని సినిమాల్లోనూ నటించింది.
జబర్దస్త్ కామెడీ షో, రష్మికి బుల్లితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ని ఇచ్చింది. అంతే కాదు, బుల్లితెరపై చాలా షోస్‌తో తనదైన గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టి పడేసింది ఈ బ్యూటీ.
బుల్లితెరపై రష్మి, సుధీర్‌ల ‘ఆన్ స్క్రీన్’ రొమాన్స్.. ఓ ట్రెండ్ సెట్టర్. అలాంటి రష్మి, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. అభిమానులు తట్టుకోగలరా.?
అసలు విషయమేంటంటే, కొద్ది రోజుల క్రితం రష్మి గౌతమ్‌కి సర్జరీ జరిగింది. కొన్నాళ్ళుగా తీవ్ర రక్త స్రావంతో బాధపడిందట రష్మి గౌతమ్.
వున్నట్లుండి తీవ్రమైన అనారోగ్యం సంభవించడంతో ఆసుపత్రిలో చేరినట్లు రష్మి చెప్పుకొచ్చింది.
Rashmi Gautam Health Problem.. ఆసుపత్రిలో.. రష్మి
ఆసుపత్రిలో సర్జరీ అనంతరం కోలుకుంటున్నట్లు వివరించిన రష్మి, ఆసుపత్రిలో సర్జరీకి ముందు తీసిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సర్జరీ తర్వాత తన పరిస్థితి అస్సలు బాలేదనీ, అలా తనను తానే చూసుకోలేకపోయాననీ రష్మి పేర్కొంది. ప్రస్తుతం రష్మి కోలుకుంటోంది.
మళ్ళీ త్వరలోనే పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకూ రెట్టించిన హుషారుతో వస్తానంటోంది రష్మి గౌతమ్.
జంతు ప్రేమికురాలు కూడా..
రష్మి అంటే గ్లామర్.. రష్మి అంటే డాన్సులు.. రష్మి అంటే, వచ్చీ రాని తెలుగులో క్యూటు క్యూటుగా మాట్లాడే మాటలు. అంతే కాదు, రష్మి జంతు ప్రేమికురాలు.
Also Read: రేయ్.! ఎవరన్నా ఈ ‘పాప’కి గుడి కట్టెయ్యండ్రా.!
స్ట్రీట్ డాగ్స్ పట్ల అమితమైన ప్రేమ ప్రదర్శిస్తుంటుంది రష్మి గౌతమ్. వాటి కోసం ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటుంది కూడా.
జంతువులపై ఎవరైనా హింసకు పాల్పడితే, సోషల్ మీడియా వేదికగా రష్మి పెద్ద యుద్ధమే చేసేస్తుంటుంది వాళ్ళపై.
ఏది ఏమైనా, రష్మి పూర్తిగా కోలుకుని, తిరిగి ఇంతకు ముందుకంటే హుషారుగా సందడి చేయాలని కోరుకుందాం.