Telangana State Financial Status.. అప్పు చేసి పప్పు కూడు.. అనేది వెనకటికి పెద్దలు చెప్పే మాట.! అప్పు చేయొద్దన్నది ఆ ‘మాట’లోని అసలు ఉద్దేశ్యం.!
కానీ, ఇప్పుడు అప్పు చేసి సంక్షేమ కూడు.. అని చెప్పుకోవాల్సి వస్తోంది.! సంక్షేమం ఇప్పుడు కొత్తగా వచ్చిందా.? అంటే, కాదు.! ఎప్పటినుంచో వున్నదే.
కాకపోతే, ఇప్పుడు నడుస్తున్న సంక్షేమం వేరు.! అది ఫ్రీ, ఇది ఫ్రీ.. అంటూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎడా పెడా ఉచిత హామీలు గుప్పించేస్తున్నాయి.
Telangana State Financial Status.. అన్నీ ఉచితమే అయితే ఎలా.?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం.. ఇది తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకం. తద్వారా, ఆర్టీసీపై పడే భారమెంత.?
మచ్చుకి ఇదొక ఉదాహరణ మాత్రమే. సామాజిక పెన్షన్లు సహా, చాలా ఉచిత హామీల నేపథ్యంలో, రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. దాంతో, అప్పులు చేయాల్సి వస్తుంది.

అంతే కదా మరి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, రోడ్లెయ్యాలి.. ఇతర అభివృద్ధి పనులకి డబ్బులు కావాలి. సో, అప్పు చేయడం తప్పనిసరి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, తెలంగాణ ‘మిగులు’ రాష్ట్రం అయ్యింది. ఆర్థికంగా దేశంలోనే నెంబర్ వన్.. అని గతంలో, కేసీయార్ చెప్పేవారు.
నెంబర్ వన్… అప్పుల రాష్ట్రం.!
కట్ చేస్తే.. అంత గొప్ప నెంబర్ వన్ రాష్ట్రం కూడా వేల కోట్లు కాదు, లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడేమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ‘అప్పు దొరకడంలేదు’ అని గగ్గోలు పెడుతున్నారు.
Also Read: అనన్య నాగళ్ళ.! యూ ఆర్ వెరీ వెరీ స్పెషల్.!
అదేంటీ, అప్పు దొరక్కపోవడమేంటి.? అదే మ్యాజిక్.! బాధ్యతాయుతంగా పని చేద్దాం.. అప్పులు పుట్టడంలేదు.. అన్నది రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమైతే కావొచ్చుగాక.
కానీ, అప్పు పుట్టని పరిస్థితి.. అంటే, రాష్ట్రం దివాళా తీసిందనే అర్థం తెరపైకి తెస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. తెలంగాణ పరిస్థితి ఇలా వుంటే, ఏపీ దుస్థితి.. అంతకు మించి.!