Ulta Chor Kotwal Ko Dante.. దొంగే, రాజైతే.? ఇంకేముంది.. సర్వనాశనం.! ఓ నానుడి వుంది హిందీలో.. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే’ అని.!
ఓ దొంగోడు, పోలీసు మీద దొంగనతం మోపడమే ‘ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే’ అనే మాట తాలూకు అర్థం.
హిందీనో, ఉర్దూనో.. మరో భాషనో.! ఏ భాష అయితేనేం, అర్థం మాత్రం.. పోలీసుని, దొంగోడు గదమాయించడం అన్నమాాట.!
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఆర్థిక నేరస్తుడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఓ దొంగ (ఆర్థిక నేరస్తుడనీ అనొచ్చు), జైల్లో చిప్ప కూడు తిన్నాడు.. ఇప్పుడేమో, పోలీసుల గుడ్డలూడదీస్తామంటున్నాడు.
Ulta Chor Kotwal Ko Dante.. దొంగోడికి తాళాలు ఇస్తే..
ఔను కదా.! దొంగోడికి తాళాలు ఇస్తే, ఇల్లు గుల్లయిపోతుంది మరి.! ఆర్థిక నేరస్తుడికి అధికారమిస్తే, రాష్ట్రమైనా.. దేశమైనా గుల్లయిపోతుంది కదా.!
దేశంలో వ్యవస్థలు ఎలా రాజకీయ అవినీతితో నిర్వీర్యమైపోతున్నాయో చూస్తున్నాం.! ఏళ్ళ తరబడి కాదు.. దశాబ్దాల తరబడి, కేసులు సాగుతూ సాగుతూ వున్నాయ్.
ఈ క్రమంలో, దొంగలు రాజకీయ నాయకులవుతున్నారు, ప్రజా ప్రతినిథులుగా మారుతున్నారు.. కీలక పదవుల్లో కూర్చుని, పాలన చేసేస్తున్నారు కూడా.!
ఇంత అవకాశం మన ప్రజాస్వామ్యం నిర్లజ్జగా దొంగలకు కల్పిస్తున్నప్పుడు, జరిగేది ‘ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే’నే కదా మరి.! అదే జరుగుతోందిప్పుడు.
నేరస్తుడిని కుర్చీ ఎక్కిస్తే..
పోలీసులేమో, దొంగల్ని పట్టుకోవాలి.. చెమడాలు వలిచెయ్యాలి. చిత్రంగా, దొంగోళ్ళు, పోలీసుల్ని బెదిరిస్తున్నారు.. బట్టలూడదీస్తామని.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
అసలంటూ సిగ్గు ఎవరికి వుండాలి.? దొంగల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ప్రజల్ని.! ప్రజలంటే ఎవరో కాదు, మనమే కదా.!
Also Read: యుద్ధమంటే ఒక్కటయ్యాం! ఇంతలోనే ముక్కలైపోతామా.?
ఎన్నికల సమయంలో తీపిగా చెప్పే మాటలు.. బుగ్గలు నిమిరే తాత్కలిక ప్రేమలు.. వెదజల్లే నెత్తుటి కూడు లాంటి కరెన్సీ నోట్లు.. వీటికి జనం కక్కుర్తి పడితే ఖేల్ ఖతమ్.!
రాజకీయాల్లో దొంగల్ని, నేరస్తుల్ని, అవినీతిపరుల్ని ప్రోత్సహిస్తే.. మనమే గుల్లయిపోతాం.. జర జాగ్రత్త.!
ప్రజా ప్రయోజనార్థం మాత్రమే సుమీ.. గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకుంటే, అది వాళ్ల ఖర్మ.