Virat Kohli Test Retirement.. క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, విరాట్ కోహ్లీనే కింగ్.! అతని డామినేషన్ అలా వుంటుంది, ప్రత్యర్థి బౌలర్ల మీద.!
కెప్టెన్‌గా కూడా టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఓ సంచలనం. నాయకుడిగా మైదానంలో జట్టుని నడిపించిన విధానం, బ్యాటుతో పరుగుల వరద పారించడం.. ఇవన్నీ కోహ్లీని ‘కింగ్’గా మార్చేశాయి.
120కి పైగా టెస్టులు.. 9 వేలకు పైగా పరుగులు.. ముప్ఫయ్ సెంచరీలు, 31 అర్థ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. వాట్ నాట్.. విరాట్ కోహ్లీ అంటేనే, పవర్.!
Virat Kohli Test Retirement.. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్..
అన్ని ఫార్మాట్ల నుంచీ తప్పు కోవాలని చాన్నాళ్ళ క్రితమే విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నా, పునరాలోచించుకున్నాడు.. సహచరులు, బీసీసీఐ సూచనతో.
ఎట్టకేలకు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని ఈసారి మరింత బలంగా నిర్ణయం తీసేసుకున్నాడు. దాంతో, ఒక్కసారిగా అంతా షాక్‌కి గురయ్యారు.

ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కి ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే విరాట్ కోహ్లీ నుంచి రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది.
థాంక్యూ కింగ్..
భారత క్రికెట్‌కి విరాట్ కోహ్లీ అందించిన సేవల నేపథ్యంలో సగటు క్రికెట్ అభిమాని, ‘థాంక్యూ కింగ్’ అంటూ, చెమర్చిన కళ్ళతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో సాధించిన రికార్డుల్ని ప్రస్తావిస్తూ, ‘ఇలాంటి క్లాస్ ప్లేయర్‌ని మళ్ళీ చూడగలమా’ అంటున్నారు అతని అభిమానులు.
Also Read: సినిమాటిక్ హింస, రక్తపాతం: ఆ శవాలేంటీ? ఈ సినిమాలేంటీ?
కొత్త నీరు వస్తే, పాత నీరు వెళ్ళిపోవాల్సిందే కదా.! క్రికెట్ లెజెండ్స్.. అనదగ్గ ఎంతోమంది క్రికెటర్లు, వయసు మీద పడ్డంతో క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు.
కానీ, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూస్తే, ఇంకో రెండు మూడేళ్ళ దాకా క్రికెట్ ఆడగలడనీ, రిటైర్మెంట్ నిర్ణయం సబబు కాదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.