Manchu Manoj Bhairavam HBD.. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ‘నేను ఒంటరి’ అంటున్నాడు.
తనను తన అన్నయ్యే దూరం పెట్టాడంటూ మంచు మంచు విష్ణుపై గుస్సా అవుతున్నాడు మనోజ్.
గత కొద్ది రోజులుగా ‘మంచు’ కుటుంబంలో ‘అన్నదమ్ముల’ పంచాయితీ నడుస్తోంది. తనపై దాడికి మంచు మనోజ్ కుట్ర పన్నాడంటూ, సాక్షాత్తూ మోహన్‌బాబు పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మరోపక్క, తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ విష్ణుపై పోలీసులకు పిర్యాదు చేశాడు మనోజ్. వెరసి, ఈ పంచాయితీ, టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయి కూర్చుంది.
సరిగ్గా ఈ తరుణంలోనే, మనోజ్ తాజా సినిమా ‘భైరవం’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. మనోజ్ నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న సినిమా ఇది.
మరోపక్క, విష్ణు నటించి, నిర్మించిన సినిమా ‘కన్నప్ప’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ‘కన్నప్ప’ మీద మనోజ్ సెటైర్లేయడం తెలిసిన విషయమే.
Manchu Manoj Bhairavam HBD.. కట్టుబట్టలతో మనోజ్‌ని ఇంట్లోంచి గెంటేస్తారా.?
కాగా, తనను కట్టుబట్టలతో గెంటేశారంటూ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశాడు మంచు మనోజ్.
ఇంట్లోంచి బయటకు కాలు బయటపెట్టాక, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అని మనోజ్ కంటతడి పెట్టాడు. కారు కూడా లాగేసుకున్నట్లు చెప్పాడు.

అలాంటి పరిస్థితుల్లో తనను తన అభిమానులు ఆదుకున్నారనీ, సన్నిహితులు ఓదార్చారనీ మనోజ్ చెప్పుకొచ్చాడు.
‘భైరవం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మనోజ్, సింపతీ కార్డ్ గట్టిగానే వాడుతున్నాడు.
Also Read: ‘మంచు’ కురిసిపోవడం ఏంటి శ్రీవిష్ణూ! తప్పు కదా ‘శివయ్యా’.!
సినిమా వేరు, సింపతీ వ్యవహారాలు వేరు. సినిమాలో కంటెంట్ వుంటే, ఆడుతుంది.. లేదంటే ఖేల్ ఖతమ్.!
అన్నట్టు, మంచు మనోజ్ పుట్టినరోజు మే 20న. ఈ సారి పుట్టినరోజు, కుటుంబ సభ్యులకు దూరంగా చేసుకోనున్నాడు మనోజ్.
ఏదిఏమైనా, ఈ జన్మకి తాను మోహన్‌బాబు తనయుడినేనని మనోజ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కొసమెరుపేంటంటే, తోడబుట్టినవాడే తన పతనాన్ని కోరుకుంటున్నాడనీ, అలాంటిది స్నేహితుడు ప్రభాస్ తన మీద నమ్మకంతో అండగా నిలిచాడని మంచు విష్ణు చెప్పడం.