Table of Contents
Allu Aravind Aa Naluguru.. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ని ‘ఏస్ ప్రొడ్యూసర్’ అంటుంటాం. మెగా ప్రొడ్యూసర్.. అనే గుర్తింపు కూడా వుందాయనకి.
అయితే, గత కొన్నాళ్ళుగా గీతా ఆర్ట్స్ సంస్థ మీద నిర్మాణాలు తగ్గాయి. జీఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్న సినిమాలని గీతా ఆర్ట్స్ తరఫున సమర్పకుడిగా వుంటున్నారు అరవింద్.
తెలుసు కదా, అల్లు అరవింద్ అంటే చిరంజీవి సతీమణి సురేఖకి సోదరుడని. దివంగత అల్లు రామలింగయ్య తనయుడీ అల్లు అరవింద్.
అల్లు అర్జున్ తండ్రి ఈ అల్లు అరవింద్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు.? అంటే, వుంది.. పెద్ద కథే వుంది.!
అల్లు అర్జున్ ఆర్మీ పైత్యం..
మెగా కాంపౌండ్ మీద గత కొన్నాళ్ళుగా అందులోంచే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ దుష్ప్రచారం చేయిస్తున్నాడు.. తన ‘ఆర్మీ’ ద్వారా.!
తనయుడు అల్లు అర్జున్‌ని ఈ విషయంలో అస్సలేమాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు అల్లు అరవింద్.
గత ఎన్నికల సమయంలో, జనసేనకు వ్యతిరేకంగా.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్ళినంత పని చేశాడు అల్లు అర్జున్.
ప్రచారానికి వెళ్ళలేదుగానీ, ‘పిలవకపోయినా వచ్చా’ అంటూ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి, స్పష్టమైన సంకేతాలు పంపాడు, తాను పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకం అని.

షరామామూలుగానే, అల్లు అర్జున్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా జనసేనకు వ్యతిరేకంగా జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేసింది.
ఇదంతా నాణేనికి ఓ వైపు. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్‌కి ముందు, అనూహ్యంగా థియేటర్ల బంద్ అంశం తెరపైకొచ్చింది.
ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పంచాయితీ షురూ అయ్యింది. దీనంతటికీ కారణం ‘ఆ నలుగురు’ అంటూ, సినీ వర్గాల్లోనే చర్చ జరిగింది.
‘ఆ నలుగురు’ అంటే, సాధారణంగా ముందు పేరు అల్లు అరవింద్‌ది, ఆ తర్వాత దిల్ రాజు, సురేష్‌బాబు, ఏషియన్ సునీల్.. ఇలా మిగతా పేర్లుంటాయ్.
Allu Aravind Aa Naluguru.. అల్లు అరవింద్ ముందు జాగ్రత్త..
తన బండారం బయటపడిందనో, లేదంటే నిజంగానే ఈ వివాదంతో తనకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికో, అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చారు.
‘పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌కి ముందర థియేటర్ల బంద్ ఆలోచన దుస్సాహసం’ అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
Also Read: Maranamass Telugu Review: హాస్యంతో కూడిన బీభత్సం.!
‘సినీ పరిశ్రమకు మేలు చేస్తున్న పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) మీద ఇలాంటి ప్రవర్తన సబబు కాదు’ అన్నారు అల్లు అరవింద్.
అంతేనా, ‘ఆ నలుగురిలో నేను లేను. నా దగ్గర వున్న థియేటర్లు 15 మాత్రమే.. అవి కూడా ముందు ముందు వుండవు’ అని అల్లు అరవింద్ చెప్పడం గమనార్హం.
కౌంటర్ ఎటాక్.. తుస్సుమంది..
నిజానికి, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడానికి, ‘కౌంటర్ ఎటాక్’ ప్రెస్ మీట్ అల్లు అరవింద్ పెడుతున్నారనే ప్రచారం మీడియాలో సాగింది అంతకు ముందు వరకూ.
కానీ, అల్లు అరవింద్ (Producer Allu Aravind) ‘ది గ్రేట్ ఎస్కేప్’ ప్లాన్ చేశారు, కొంతమేర సక్సెస్ అయ్యారు కూడా.
అయినా, అనూహ్యంగా థియేటర్ల బంద్ నిర్ణయమేంటి.? దీని వెనుక కుట్రదారులెవరు.? అని ఏపీ ప్రభుత్వం కూపీ లాగే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో, సినీ పరిశ్రమలో కలకలం బయల్దేరింది.
తన పేరు బయటకు వస్తుందేమోనని అల్లు అరవింద్ కంగారు పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చాక, అల్లు అరవింద్ కంగారు పడటంలో అర్థం వుంది మరి.!