Table of Contents
Deepika Padukone Spirit Sandeep.. సినిమా అంటేనే గ్లామర్.. అలాంటప్పుడు, వెండితెరపై గ్లామర్ లేకపోతే ఎలా.? ఈ ‘అమాయకపు’ ప్రశ్న చాలామంది సినీ ప్రముఖుల నుంచే వస్తుంటుంది.
చాలామంది హీరోయిన్లు కూడా ఈ మాటని చాలా చాలా సందర్భాల్లో చెప్పే వున్నారు, చెబుతూనే వున్నారు.. చెబుతూనే వుంటారు కూడా.!
సినిమా కోసం బికినీ వేస్తే పాపమా.?
అదే సినిమా కోసం లిప్ లాక్ చేస్తే నేరమా.?
సినిమాల్లో పడక గది సన్నివేశాలు చేస్తే తప్పా.?
‘తప్పే కాదు’ అని సమాధానాలు చెప్పిన హీరోయిన్లు బోల్డంతమంది వుంటారు. ‘సినిమా అన్నాక అన్నీ చేయాలి..’ అని చెప్పిన హీరోయిన్లు కోకొల్లలు.
Deepika Padukone Spirit Sandeep.. దీపిక పదుకొనే.. వై దిస్ కొలవెరి.?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా పలు సందర్భాల్లో ఇలానే చెప్పింది. ‘ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ’ గురించి దీపిక చెప్పిన ‘గ్లామరస్ పాఠాలు’ అన్నీ ఇన్నీ కావు.

హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి, వెండితెరపై అందాల భామలు అంగాంగ ప్రదర్శన చేసిన సందర్భాలు లెక్కలేనన్ని వున్నాయి. దీపిక ఇందుకు మినహాయింపేమీ కాదు.
కానీ, ఇప్పడే ఎందుకు దీపిక చుట్టూ ఈ రచ్చ జరుగుతోంది.? అసలు కారణమేంటి.?
దర్శకుడి తప్పేమున్నదబ్బా.?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ అనే సినిమా కోసం దీపిక పదుకొనేని హీరోయిన్‌గా తీసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల, ఆ ప్రాజెక్టులోకి దీపిక బదులుగా తృప్తి దిమ్రి వచ్చింది.
అయితే, సినిమాలో వల్గర్ సీన్స్ వున్నాయనీ, అందుకే సినిమా నుంచి దీపిక తప్పుకుందనీ బాలీవుడ్‌లో ఓ వర్గం మీడియా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని ట్రోల్ చేయడం మొదలు పెట్టింది.
ఈ క్రమంలో, సందీప్ రెడ్డి వంగా కూడా ఘాటుగానే స్పందించాడు. సినిమాలో కంటెంట్‌ని దీపిక తన పీఆర్ టీమ్ ద్వారా లీక్ చేయించిందని సందీప్ రెడ్డి వంగా ఆరోపించాడు.
లీకుల గోల.. లిప్పు లాకుల లీల.!
అసలంటూ, ఆ సీన్స్‌కి దీపిక ‘నో’ ఎందుకు చెబుతుంది.? అలాంటివి ఆమె చాలా సినిమాల్లో చేసింది కదా.? అన్న ఇంగితమైతే బాలీవుడ్ మీడియాకి లేకుండా పోయింది.
Also Read: ఎద్దు ఈనింది.! అయితే, దూడని కట్టెయ్.!
ఒక్కటి మాత్రం నిజం.. బాలీవుడ్ మీడియా ఉడత ఊపులకి బెదిరే రకం కాదు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే.
దీపిక పదుకొనే తన పీఆర్ టీమ్‌తో సందీప్ రెడ్డి వంగా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.