Ys Jagan Sametha Kashtalu.. ఎద్దు ఈనడమేంటి.? దూడని కట్టెయ్యడమేంటి.? ఎద్దు అంటే, మగది. దానికి దూడని కనే అవకాశం వుండదు కదా.!
అబ్బే, మగాళ్ళు కూడా పిల్లల్ని కనేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని మనమే మార్చేస్తున్నాం. ‘ఆడ – ఆడ’, ‘మగ – మగ’ సంపర్కాల్ని చట్టబద్ధం చేసేస్తున్న రోజులివి.
మనుషులే, ప్రకృతి ధర్మాన్ని తప్పుతున్నప్పుడు, జంతువులకంటూ ధర్మమే లేనప్పుడు, ఎద్దు ఎందుకు దూడని కనకూడదు.? ఏమో, అది కూడా ముందు ముందు చూస్తామేమో.!
Ys Jagan Sametha Kashtalu.. వైఎస్ జగన్ ‘సామెత’ కష్టం.!
ఏదో చెప్పాలనుకున్నారు.. కొన్ని రోజులపాటు దాన్ని ప్రాక్టీస్ చేసినట్లున్నారు. కష్టపడి ప్రెస్ మీట్‌లో దాన్ని చదివేందుకు ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ప్రెస్ మీట్ పెట్టి అభాసుపాలైపోవడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, చట్ట సభల్లోనూ ఇలాగే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు.
అసలు సమస్య అదే..
కొన్ని కొన్ని విషయాల్ని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకోరో, అర్థం చేసుకున్నా.. వాటిని ప్రెజెంట్ చేసే సామర్థ్యం ఆయనకు వుండదో.. ఈ గందరగోళమైతే ప్రతిసారీ జరుగుతూనే వుంది.
Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!
అసలలాంటి సామెత చెప్పాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు ఇచ్చింది ఎవరో ఏమోగాన, వైఎస్ జగన్, ‘ఎద్దు ఈనడం’ గురించి చెప్పడానికి, నానా తంటాలూ పడ్డారు.
‘ఈనడం’ అనే మాట పలకలేక, చివరికి ‘బర్త్’ అంటూ ఆంగ్లంలో చెప్పాల్సి వచ్చింది. మిగతా ప్రెస్ మీట్ వ్యవహారం అంతా పక్కకి పోయి, ‘జగన్‌కి నోరు తిరగకపోవడం’ హైలైట్ అయ్యింది.
ఏతావాతా చెప్పేదేంటంటే, సామెతల జోలికి ఇకపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళాలనుకుంటే, తగినంత ‘ప్రాక్టీస్’ అవసరం. ప్రాక్టీస్ కుదరకపోతే, సామెతల్ని ‘బ్యాన్’ చేయడం ఉత్తమం.