Table of Contents
Betting Apps ED Cases.. రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల.. అబ్బో, లిస్టు పెద్దదే.! వీళ్ళందిరపైనా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది.
ఎందుకో తెలుసు కదా.? ఇంకెందుకు.. నిస్సిగ్గుగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినందుకు.! బెట్టింగ్ ప్రాణాలు తీస్తుందని చిన్నప్పటినుంచీ వింటూనే వున్నాం.
కానీ, ‘బెట్టింగ్ ప్రాణాల్ని తీస్తుందని తెలియక, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాం.. క్షమించండి’ అంటూ పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా డ్రామాలకు తెరలేపారు.
బెట్టింగ్ యాప్స్‌పై కన్నెర్ర..
కుప్పలు తెప్పలుగా బెట్టింగ్ యాప్స్ అందుబాటులో వున్నాయ్. వాటి మీద, ప్రభుత్వం మొదట్లోనే ఉక్కుపాదం మోపి వుండాలి. కానీ, అలా చేయలేదు.
ఇక, ప్రముఖులు ఆ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం ద్వారా, ‘నెత్తుటి కూడు’ని బొక్కేశారు. ఔను, అది ముమ్మాటికీ నెత్తుటి కూడే.

ఎంతమంది బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయారో లెక్కలు తేల్చడం కష్టం. ఎందుకంటే, చాలామంది తాము ఎందుకు మోసపోయామో ఎవరికీ చెప్పకుండా బలవన్మరణాలకు పాల్పడ్డారు కాబట్టి.
Betting Apps ED Cases.. కేసులతో సరిపెట్టేస్తారా.?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో మామూలుగా వుండదు. ఒక్కొక్కరికీ పగిలిపోద్ది.. అనే చర్చ జరుగుతున్నా, ‘ఈడీ’ నుంచి తప్పించుకున్న ప్రముఖులు బోల్డంతమంది కనిపిస్తారు.
ఆ లెక్కన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో, ఎంతమంది సెలబ్రిటీలకు శిక్షలు పడతాయి.? శిక్షలు పడతాయా.? జరీమానాతో సరిపెడతారా.?

నిజానికి, అందరి మీదా హత్య కేసులే బనాయించాల్సి వుంటుంది. ఈడీ ఆ స్థాయిలో చర్యలకు సిద్ధమవుతుందా.? అన్నది మిలియన్ డాలర్స్ క్వశ్చనే.
ఉక్కుపాదం మోపేదెలా.?
నిజానికి, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. రాష్ట్రాల స్థాయిలో, బెట్టింగ్ యాప్స్ మీదా.. వాటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖుల మీదా ఉక్కు పాదం మోపాల్సిందే.

బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన ప్రముఖుల్లో రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, శ్రీముఖి, శ్యామల తదితరులున్నారు.
Also Read: AI సిత్తరమ్.! సినిమాకి ‘హీరోయిన్ గ్లామరు’తో పనేముంది.?
కొందరు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్స్‌ని విచ్చల విడిగా ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు లక్షల్లో.. సొమ్ములు ముట్టజెప్పారు ఆయా ప్రముఖులకి.
వీళ్ళలో కొందరు తెలియక తప్పు చేశామంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.