Allu Arjun Atlee Four.. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌కి సంబంధించి రోజుకో కొత్త గాసిప్ ప్రచారంలోకి వస్తోంది. అది కూడా, ఒకదాన్ని మించి ఇంకోటి.!
తాజాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.
Allu Arjun Atlee Four.. కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా..
విభిన్నమైన పాత్రల్ని ఒకే సినిమాలో పోషించడమంటే.. ముందుగా గుర్తుకొచ్చే పేరు విశ్వ నటుడు కమల్ హాసన్.
డబుల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ మాత్రమే కాదు.. అంతకు మించి, ‘దశావతారం’ వరకూ వెళ్ళిపోయారు సీనియర్ నటుడు కమల్ హాసన్.
తెలుగులో అయితే, డబుల్ రోల్స్ చాలామంది హీరోలు చేశారు. ట్రిపుల్ రోల్ చేసిన హీరో అంటే, మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలో.
ఒక్కడు కాదు.. నలుగురు..
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో నలుగురు ‘అల్లు అర్జున్’లు కనిపించబోతున్నారట. తాతయ్య గెటప్, తండ్రి గెటప్, ఇద్దరు అన్నదమ్ములు.. ఇలా నాలుగు పాత్రలట.
ఈ గాసిప్ నిజమేనా.? అంటే, ప్రస్తుతానికి నిజమేనని అనుకోవాలి. అల్లు అర్జున్ మొదటగా పెదవి విప్పుతాడా.? దర్శకుడు అట్లీ క్లారిటీ ఇస్తాడా.? అన్నదే సస్పెన్స్.
Also Read: ‘థగ్ లైఫ్’ రివ్యూ.! మణిరత్నం మార్క్ ఏదీ.? ఎక్కడ.?
‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న సినిమా ఇది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కబోతోంది.
జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ తన సత్తా ఈ సినిమాతో చాటబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ వాడుతున్నాడు. ఈ మేరకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టీమ్‌తో అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే.
హీరో నాలుగు రోల్స్ చేస్తున్నాడంటే, హీరోయిన్లు కూడా.. అదే స్థాయిలో వుండాలి కదా.?