జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్.! తెలియక హత్య చేశానని బుకాయిస్తే.?
Prakash Raj The Kashmir Files
Just Asking Prakash Raj Betting.. హత్య అంటే, హత్య అంతే.! తెలియక చేసినా, తెలిసి చేసినా హత్య హత్యే.! కొన్ని వేల కుటుంబాలు.. కాదు కాదు, లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్.!
పదుల సంఖ్యలో.. కాదు కాదు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రాణాలు పోయాయ్.! కారణం, బెట్టింగ్ యాప్స్. కొన్నేళ్ళ క్రితం మొదలైన ఈ ‘క్యాన్సర్’, చాపకింద నీరులా పాకేసింది.
ఈ క్యాన్సర్ వ్యాప్తికి తమవంతుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు ప్రముఖులు.! మరీ ముఖ్యంగా సినీ ప్రముఖుల ‘పాత్ర’ చాలా చాలా ఎక్కువ ఈ నేరంలో.
‘తెలియక చేశాం’ అని కొందరు సెలబ్రిటీలు చెబుతున్నారు. ఆ లిస్టులో ‘జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్’ కూడా వున్నాడు.! అదేంటీ, ఆయన మేతావి కదా.?
Just Asking Prakash Raj Betting.. జస్ట్ ఆస్కింగ్ మేతావి.!
మేతావి అంటే, ఇతరుల్ని ప్రశ్నించడంలో మాత్రమే సుమీ.! ‘జస్ట్ ఆస్కింగ్’ అనే ఓ హ్యాష్ ట్యాగ్ వేసుకుని, సోషల్ మీడియా వేదికగా అందర్నీ ప్రశ్నించేస్తుంటాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరూ అంటే, ప్రకాష్ రాజ్‌కి ఎక్కడో కాలిపోతుంటుంది. వాళ్ళపై జస్ట్ ఆస్కింగ్.. అంటూ చెత్త చెత్త ప్రశ్నలు వేసేస్తుంటాడీయన.
మహా మేతావి, పైగా సినీ ప్రముఖుడు.. ఒకప్పుడు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ, ఇప్పుడు ‘క్యారెక్టర్‌లెస్’గా మిగిలిపోయాడు.
ఉక్కుపాదం మోపాల్సిందే..
ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తన వంతు సహకరించాడు.. ఓ ప్రకటనలో నటించాడు. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కుపాదం మోపింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖుల తాట తీసే పని మొదలెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో, పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు వెళ్ళాయి. ఆ లిస్టులో ప్రకాష్ రాజ్ పేరు కూడా వుంది.
‘నాకేం తెలీదు.. ఆ కాంట్రాక్ట్ ఎప్పుడో రద్దయ్యింది. అది తప్పని నాకు అప్పుడు తెలియదు. తెలిశాక, రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంట్రాక్ట్ ముగిశాక, దాన్ని రెన్యువల్ చేయలేదు’ అని ప్రకాష్ రాజ్ సెలవిచ్చాడు.
Also Read: Nani Paradise.. ఇలా తిట్టించుకోవడం అవసరమా నానీ.?
అలా ఎలా అంత తేలిగ్గా చెప్పేస్తావ్ ప్రకాష్ రాజ్.! అందర్నీ ప్రశ్నిస్తుంటాను కాబట్టి, నా మీదకు ఓ ప్రశ్న వచ్చిన్పపుడు సమాధానం చెప్పాలి కదా.. అంటూ వీడియో విడుదల చేశాడు.
ఇందులో ప్రకాష్ రాజ్, చేసిన తప్పుకి లెంపలేసుకోలేదు. ఎవరికీ క్షమాపణ కూడా చెప్పినట్లు లేదు. నిజానికి, బెట్టింగ్ యాప్స్ వల్ల పైన పేర్కొన్నట్లు చాలా నష్టం జరిగింది.
చాలా జీవితాలు ఆర్థిక భారంతో చితికిపోయాయి. చాలా ప్రాణాలు పోయాయ్ కూడా.! దానికి ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా కారకుడయ్యాడు ప్రకాష్ రాజ్.
ప్రతి మరణానికీ ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పాలి. రోడ్డున పడ్డ ప్రతి కుటుంబానికీ ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పి తీరాలి.! తెలియక చేశానంటే కుదరదు.!