Akkineni Nagarjuna Coolie.. నటుడిగా అక్కినేని నాగార్జున తన ప్రతి సినిమా విషయంలోనూ సూపర్ ఎక్సైట్మెంట్ ప్రదర్శిస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే.
కొత్త దర్శకులతో పని చేయడం అక్కినేని నాగార్జునకి (Akkineni Nagarjuna) భలే ఇష్టం. కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేయడంలోనూ అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా.
నటుడిగా, నిర్మాతగా అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. హీరోగా స్టార్‌డమ్ కొనసాగిస్తూనే, ఇంకోవైపు, ఇతర హీరోల సినిమల్లో గెస్ట్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు నాగార్జున.
‘కూలీ’లో నాగార్జున విలనిజం..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున విలనిజం ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో తన పాత్ర సైమన్ గురించి చెబుతూ, విలనిజంలో కూడా హీరోయిజం కనిపిస్తుందని చెప్పారు నాగ్.
నిజానికి, ‘సైమన్’ పాత్ర తనకు బాగా నచ్చిందనీ, నాగార్జున ఆ పాత్ర చేశాక, ఆ పాత్రలో నాగ్ కంటే తాను సైతం బాగా చేయగలనని అనిపించలేదని స్వయంగా రజనీకాంత్ చెప్పడం గమనార్హం.
Akkineni Nagarjuna Coolie.. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్..
బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, శాండల్‌వుడ్ నుంచి ఉపేంద్ర, మలయాళ సినీ పరిశ్రమ నుంచి సౌబిన్ తదితరులు ఈ ‘కూలీ’ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్దే ‘మోనిక’ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: వాళ్ళకి సమస్య హిందీతో కాదు, పవన్ కళ్యాణ్‌తో.!
అన్నట్టు, మొన్నీమధ్యనే ‘కుబేర’ సినిమాలో అక్కినేని నాగార్జున నటించారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా అది. శేఖర్ కమ్ముల ఈ ‘కుబేర’ సినిమాని తెరకెక్కించాడు.
‘కుబేర’ మంచి విజయాన్ని అందుకోగా, ఈ ‘కూలీ’ అంతకు మించిన విజయాన్ని అందుకుంటుందని ‘కింగ్’ అక్కినేని నాగార్జున చెబుతున్నారు.
