Table of Contents
Polavaram Project Harish Rao.. అంతా మా ఇష్టం.! ఇది రాజకీయం.! కుంగుతాయ్.. కూలతాయ్.. మమ్మల్ని ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు.!
మీరు కట్టిన ప్రాజెక్టులు కూలితే తప్పు లేదుగానీ, మేం కట్టిన ప్రాజెక్టులు కుంగితే నేరమా.?
అసలేం జరుగుతోంది రాజకీయాల్లో.? రాజకీయమంటే ప్రజా సేవ కదా.? ప్రాజెక్టులు నిర్మించేది ప్రజాధనంతో కదా.? మరి, ప్రజా ప్రతినిథులకి బాధ్యత లేకపోతే ఎలా.?
రాజకీయ నాయకులు, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే ఎలా.? బాధ్యత లేని రాజకీయం అత్యంత దుర్మార్గం కదా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.
Polavaram Project Harish Rao.. పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిందా.?
ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి నేత హరీష్ రావు, పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిందని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఆయన ఉద్దేశ్యం బహుశా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఓ ‘రక్షణ గోడ’ గురించి కావొచ్చు.. అదే, కఫర్ డ్యామ్ వ్యవహారం గురించి అయి వుంటుంది.
కానీ, పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిందని హరీష్ రావు అంత బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్యానించడం అస్సలేమాత్రం సబబు కాదు.
కాళేశ్వరం కథేంటి.?
కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలిన వ్యవహారంలో, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ సహా, అప్పట్లో మంత్రిగా పని చేసిన హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
‘‘పిల్లర్లు కుంగిన వ్యవహారంలో కేసీయార్ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు.. మరి, పోలవరం కూలిన ఘటనలో ప్రధాని మీద చర్యలు తీసుకోవద్దా.?’’ అన్నది హరీష్ రావు వాదన.
ఉద్యమ సమయంలో హరీష్ రావు సహా, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విపరీత వ్యాఖ్యలు చేయడం చూశాం. అప్పుడూ, ఇప్పుడూ.. గులాబీ నేతలది అదే పద్ధతి.
మారని గులాబీ తీరు..
అధికారం కోల్పోయాక కూడా, గులాబీ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదనడానికి, హరీష్ రావు వ్యాఖ్యలే నిదర్శనం.
పోలవరం ప్రాజెక్టు కూలిపోలేదు.. అత్యంత క్లిష్టతరమైన ఆ ప్రాజెక్టుకి సంబంధించి కఫర్ డ్యామ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదావరి నది మీద వచ్చే వరద అలాంటిది.
Also Read: పుస్తెలమ్మినాగానీ.. ఇకపై ‘పులస’ దొరకడం కష్టమే.!
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం వేరు. ఇది పూర్తిగా ఎత్తిపోతల వ్యవహారం లాంటిది. అలాగని, పోలవరం ప్రాజెక్టులో తప్పులు దొర్లచ్చా.? అంటే, దొర్లకూడదు.. అక్కడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.
