Pulivendula Flop Show Jagan.. కేవలం జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే.! అలాగని ఎవరైనా ‘లైట్’ తీసుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
అది, పులివెందుల నియోజకవర్గం. పులివెందుల పులి బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
పులివెందులలో స్థానిక ఎన్నికైనాసరే, గెలవడం సంగతి తర్వాత, ముందైతే వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసే ధైర్యముందా.? అన్న ప్రశ్న తలెత్తేది.
ఏం, ఎందుకు లేదు.! గెలిచి తీరతాం.! అంటూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ ప్రకటించింది. దాంతో, అంతా ఆశ్చర్యపోయారు.
అధికారం టీడీపీ చేతుల్లో వున్నాగానీ, పులివెందులలో వైసీపీకి ధీటుగా నిలబడటం వల్ల ఒరిగేదేంటి.? అన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లోనూ కనిపించింది.
Pulivendula Flop Show Jagan.. మట్టికరిచిన వైసీపీ.
వైసీపీ అయితే, టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని ఎగతాళి చేసింది. కానీ, టీడీపీ పోటీ చేసింది.. వైసీపీని మట్టికరిపించింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ కడప జిల్లాలో కూటమి గట్టి షాక్ ఇచ్చింది వైసీపీకి. పులివెందులలో వైఎస్ జగన్ గెలిచినా, కూటమి ప్రభావం గట్టిగానే కనిపించిందక్కడ.
అసలంటూ, ఓటర్లు ఇతర పార్టీలకు ఓటెయ్యడానికే పులివెందులలో భయపడతారన్న ప్రచారం వుంది. ఆ భయాల్ని వీడి, ఓటర్లు పోలింగ్ బూత్‌ల వైపు నడిచారు.

ఫలితంగా, వైసీపీ ఓడిపోయింది. అలాంటిలాంటి ఓటమి కాదు, వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదంటే, టీడీపీ ఏ స్థాయి విజయం అందుకుందో అర్థం చేసుకోవచ్చు.
స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్జ్ వుంటుంది. కానీ, మరీ ఇంతలానా.? ‘వై నాట్ కుప్పం’ అన్నారు జగన్ గతంలో. కానీ, ఇప్పుడు ‘వై నాట్ పులివెందుల’ అనే ధీమా టీడీపీలో పెరిగింది.
పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినా, 2024 ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులలో వైఎస్ జగన్ ఎక్కువ రోజులు వున్నది లేదు.
Also Read: నాన్సెన్స్.. హృతిక్ రోషన్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారా.?
పట్టుమని పది రోజులు, ఏకబిగిన పులివెందులలో వైఎస్ జగన్ లేకపోవడం, నియోజకవర్గంలో జగన్ పట్టు కోల్పోవడానికి కారణమన్న చర్చ జరుగుతోంది.
ఒక్కటి మాత్రం నిజం.. పులివెందుల ఇకపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచు కోట కాదు. సమీప భవిష్యత్తులో వైఎస్ జగన్, వేరే నియోజకవర్గం చూసుకోవాలేమో.!