Kalyani Priyadarshan Lokah 100cr.. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం వంద కోట్ల క్లబ్బులో చేరింది.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతోంది.
అదే, ‘లోక’. తెలుగులో ‘కొత్త లోక’గా విడుదలైన ‘లోక’ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిందీ సినిమా.
నిజానికి, పెద్దగా పబ్లిసిటీ లేకుండానే, ‘లోక’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలయ్యాక, స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ నేపథ్యంలో, పబ్లిసిటీ పెంచారు.
Kalyani Priyadarshan Lokah 100cr.. వంద కోట్ల హీరోయిన్ కళ్యాణి..
తెలుగులో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తొలి సినిమా ‘హలో’. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ఇది. కానీ, తెలుగులో ఆమెకు డిజాస్ట్రస్ రిజల్ట్‌నే మిగిల్చింది ‘హలో’.
ఆ తర్వాత తెలుగులో మరో రెండు సినిమాల్లోనూ కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. అవి కూడా, ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వలేదు.
వున్నంతలో ‘చిత్రలహరి’ సినిమా, కాస్త పాజిటివ్ రిజల్ట్‌ని కళ్యాణి ప్రియదర్శన్‌కి అందించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కళ్యాణి కనిపించిన దాఖలాల్లేవు.
దేశవ్యాప్త గుర్తింపు..
ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ గురించి టాలీవుడ్ సహా, బాలీవుడ్‌లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమెకు కొత్త కొత్త అవకాశాలూ పోటెత్తుతున్నాయిప్పుడు.
‘100 కోట్ల హీరోయిన్’ అంటూ కళ్యాణి గురించి, వివిధ సినీ పరిశ్రమల్లో జనం చర్చించుకుంటున్నారు. ఈ కొత్త గుర్తింపు ఆనందంగా వుందని కళ్యాణి ప్రియదర్శన్ చెబుతోంది.
Also Read: ‘కిష్కింధపురి’.. అనుపమ ‘అన్-ఇంటరెస్టెడ్’.?
ఫిమేల్ సెంట్రిక్ మూవీస్‌లో ఇదే పెద్ద హిట్ సినిమా.. అని ట్రేడ్ విశ్లేషకులు అభివర్ణిస్తుండడం గమనార్హం.
ఒకప్పుడు డిజాస్టర్ సినిమాల హీరోయిన్.. అనిపించుకున్న కళ్యాణి ప్రియదర్శన్… ఇప్పుడు, సూపర్ హీరోయిన్.. అనే ట్యాగ్ దక్కించుకుంది.