Table of Contents
Engineering Placement Package Studies.. ఇంజనీరింగ్ విద్య అంటే ఏంటి.? నైపుణ్యాలు అవసరమైన విద్య.! కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్‌లో ‘నైపుణ్యానికి’ ప్రాధాన్యత ఎంత.?
వాస్తవానికి, తమ పిల్లల్ని ఇంజనీరింగ్ విద్య వైపు నడిపించాలనుకుంటున్న తల్లిదండ్రులు, మొదటగా చేసే ఆలోచన ‘ప్యాకేజీ, ప్లేస్‌మెంట్’ గురించే.
ఏ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బావుంటాయి.? ఏ ఇంజనీరింగ్ కాలేజీకి అత్యధిక ప్యాకేజీ దక్కుతోంది.? ఇవే ప్రామాణికంగా మారిపోయాయి.
Engineering Placement Package Studies.. ఐఐటీ, ఎన్ఐటీ.. ఇక్కడా అవే ప్రాధాన్యతాంశాలు..
ఐఐటీలు అయినా, ఎన్ఐటీలు అయినా.. ఇంకో ప్రముఖ జాతీయ విద్యా సంస్థ అయినా.. అక్కడ కూడా, ప్యాకేజీ అలానే ప్లేస్‌మెంట్స్ ఎలా వున్నాయన్నదే ఇంజనీరింగ్ విద్యకు ప్రామాణికం అయి కూర్చుంది.
ఔను, ఇంజనీరింగ్ కాలేజీలకు రేటింగులు కూడా ఇలానే ఇస్తున్నారు కొందరు. ఫలానా చోట ప్యాకేజీలు బాగా వస్తాయ్.. ఫలానా చోట ప్లేస్‌మెంట్ పక్కా.. అన్న కోణంలోనే, విద్యార్థులూ ఆసక్తి చూపుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ‘నైపుణ్యం’ అన్న చర్చకు ఆస్కారమే లేకుండా పోతోంది. అందుకే, కంప్యూటర్ సైన్సెస్ తప్ప, వేరే విభాగాలు విద్యార్థుల దృష్టిలో వుండటంలేదు.
కావాల్సింది నైపుణ్యమే..
స్కిల్.. గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు నడుపుతున్నవారూ ఇవే మాటలు చెబుతున్నారు. విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాలూ కొంత మేర జరుగుతున్నాయి.
కానీ, కంప్యూటర్ సైన్స్ తప్ప ఇంకే ఇంజనీరింగ్ చేసినాగానీ, ప్యాకేజీలు వుండవు.. ప్లేస్‌మెంట్స్ అసలే వుండవు.. అన్న నెగెటివ్ ప్రచారం అంతకంటే ఎక్కువగా జరుగుతోంది.
మరి, ఈ పరిస్థితి మారేదెలా.? ఐఐటీలు, ఎన్‌ఐటీలలలో అన్ని విభాగాలూ వుంటాయి.. అన్నీ ‘ఫుల్’ అయిపోతున్నాయి. అలా బయటకి వస్తున్న ఇంజనీర్లు ఏం చేస్తున్నారు.?
వీళ్ళలోనూ చాలామంది, సాఫ్ట్‌వేర్ రంగంలోనే సెటిలైపోతున్నారు. ఆకర్షణీయమైన వేతనాలే అందుక్కారణం. అయితే, అక్కడా ‘స్కిల్’ అవసరమని గుర్తించాలి విద్యార్థులైనా, విద్యార్థుల తల్లిదండ్రులైనా.
ఆత్మ నిర్భర భారత్..
కీలకమైన రంగాల్లో నిపుణుల కొరతని ఎదుర్కంటోంది భారత దేశం. మనది యువ భారతం.. అని చెప్పుకుంటున్నాం.
కానీ, రక్షణ సహా వివిధ రంగాల్లో నిపుణులంటే, కంప్యూటర్ సైన్స్ విభాగం సహా అన్ని విభాగాలూ అత్యంత కీలకం.
ఆయా ఇంజనీరింగ్ విభాగం నుంచి ఎంతమంది నిపుణులు బయటకు వస్తున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది.
టాప్ ర్యాంకర్లు కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్‌కే పరిమితమైపోతే, అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్.. తదితర విభాగాల పనిస్థితి ఏంటి.?
పోనీ, సాఫ్ట్‌వేర్ రంగంలో పరిస్థితులు బావున్నాయా.? అంటే, అదీ లేదాయె.! మరి, ఇప్పటికే తయారైన కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీర్లు, కొత్తగా వస్తున్నవారు.. వీళ్ళ భవిష్యత్ ఏంటన్నది అగమ్యగోచరం.
