Shrasti Verma BiggBossTelugu9 అరరె.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్లో తొలి వికెట్ పడిపోయిందే.! అదీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ క్లీన్ బౌల్డ్ అయిపోయిందే.!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో అంటేనే, బోల్డంత గందరగోళం. రణ రంగం అంటాడు, ఇంకోటంటాడు.. హోస్ట్ అక్కినేని నాగార్జున, నానా రకాల ఫీట్స్ చేస్తాడు.
కానీ, చివరికి జరిగేది.. అంతా హంబక్. ఎవర్ని, హౌస్ నుంచి ఎప్పుడు ఎందుకు పంపేస్తాడే బిగ్ బాస్కే ఎరుక.! అదేంటో, అది కూడా ముందుగానే లీక్ అయిపోతుంది.
Shrasti Verma BiggBossTelugu9.. శ్రష్టి మాత్రమే ఎందుకు.?
శ్రష్టి, ‘పుష్ప2’ సాంగ్ నుంచి బాగా పాపులర్ అయ్యింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద, ఆరోపణలు చేసి.. అతన్ని జైలుకు పంపింది కూడా ఈ శ్రష్టినే.
అలాంటి శ్రష్టి, బిగ్ బాస్ హౌస్‌లో బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అంతా ఆశించారు. కానీ, ఆమెకు అలాంటి స్క్రిప్ట్ రాసివ్వలేదు.
శ్రష్టి నుంచి హౌస్‌లో తగినన్ని డాన్సులు కూడా చూడలేకపోయాం. వచ్చింది, వెళ్ళిపోయిందంతే. అయినా, ఒక్క వారంలోనే ఏం జరిగిపోతుంది.?
ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు, ఆమె కథని వారం రోజుల్లోనే ముగించేశాడు బిగ్ బాస్. ఈ సీజన్ కంటెస్టెంట్లలో ఒకరిద్దు తప్ప, పెద్దగా కంటెస్టెంట్లెవరూ రిజిస్టర్ కాలేదు.
వున్నంతలో, పాపులర్ కంటెస్టెంట్స్.. అంటే, ఆ లిస్టులో శ్రష్టి వర్మ పేరు కూడా వుంటుంది. అలాంటి శ్రష్టి వర్మని బయటకు పంపేసి, బిగ్ బాస్ ఏం సంకేతాలు ఇవ్వాలనుకున్నాడో ఏమో.
Also Read: ఉద్యోగాలన్నీ ఊడిపోతే.! ఆ భయాన్ని అధిగమిస్తేనే భవిష్యత్తు.!
కమెడియన్ సుమన్ శెట్టి, హౌస్‌లో అస్సలు చేసిందేమీ లేదు. ఆ మాటకొస్తే, ఏ కంటెస్టెంట్ అయినా.. ఏం అంత గొప్పగా ఆడేశారని వారం రోజుల్లో.?
అన్నట్టు, శ్రష్టి వర్మ వెళుతూ వెళుతూ భరణి, తనూజ, రీతూ.. వీళ్ళ మీద ‘డబుల్ ఫేస్డ్’ అంటూ ఆరోపణలు చేసిపోయింది. అదో ట్విస్ట్.. అని మనం ఫీలవ్వాలంతే.
ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్స్‌లో శనివారం ఎపిసోడ్ తేలిపోయింది. ఆదివారం ఎపిసోడ్లో ‘మిరాయ్’ టీమ్ వచ్చినా.. అదీ తుస్సుమంది.
ఫన్ స్థానంలో ప్రస్ట్రేషన్ మిగిలింది ఈ వీకెండ్ బిగ్ బాస్ వీక్షకులకి.