BiggBossTelugu9 Rithu Chowdary Love.. ఓ పునర్నవి భూపాలం.. ఓ సిరి హన్మంత్.. ఓ మోనాల్ గజ్జర్.. ఓ దీప్తి సునైన.. ఇలా చెప్పుకుంటూ పోతే, బిగ్ బాస్ ప్రేమ కథలు అన్నీ ఇన్నీ కావు.
వీటిల్లో ఒక్కటైనా, బిగ్ బాస్ హౌస్ దాటి, నిజమయ్యిందా.? ప్చ్.. లేదు.! కమర్షియల్ సినిమాల్లో హీరో – హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌కి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
సినిమా అంటేనే.. హీరో, హీరోయిన్.. ఆ లవ్ ట్రాక్.. ఆ రొమాంటిక్ కెమిస్ట్రీ.. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.
లిప్ లాక్ సీన్స్ కావొచ్చు, బెడ్రూమ్ సీన్స్ కావొచ్చు.. ఓ వర్గం ఆడియన్స్‌కి మాంఛి కిక్ ఇస్తాయి. అందుకే, ఆ సీన్స్‌ని చాలా స్పెషల్‌గా డిజైన్ చేస్తుంటారు సినిమాల్లో.
BiggBossTelugu9 Rithu Chowdary Love.. బిగ్ బాస్ ప్రేమలు కూడా అంతే..
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్ నడుస్తోంది. రీతూ చౌదరి ఈసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఆమెకి ఓ లవ్ ట్రాక్ రాశారు. ఆమె ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతోంది.

గత సీజన్లో విష్ణు ప్రియ ఇలా లవ్ ట్రాక్ కోసమే.. అన్నట్లు, హౌస్‌లో సందడి చేసింది. బిగ్ బాస్ లవ్ ట్రాక్స్.. నిజంగానే టీఆర్పీ పెంచడానికి ఉపయోగపడుతున్నాయా.?
ప్చ్.. లేదు.! అనే వాదనొకటుంది. కాకపోతే, ఈ తరహా డ్రమెటిక్ లవ్ ట్రాక్స్ వల్ల.. సోషల్ మీడియాలో నడిచే నెగెటివిటీ, పరోక్షంగా బిగ్ బాస్‌కి అడ్వాంటేజ్ అవుతోందన్న వాదనా లేకపోలేదు.
పునర్నవి – రాహుల్ సిప్లిగంజ్.. సెన్సేషనల్ లవ్ ట్రాక్
అన్నట్టు, బిగ్ బాస్ లవ్ ట్రాక్స్‌లో సిరి హన్మంత్, బాగా నెగెటివిటీని ఎదుర్కొంది. అది ఆ సీజన్ నడిచిన కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత అంతా మామూలే.

ఇప్పటిదాకా జరిగిన బిగ్ బాస్ సీజన్లన్నింటిలోకీ.. హాట్ అండ్ సెన్సేషనల్ లవ్ ట్రాక్.. అంటే, అది పునర్నవిదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Also Read: తొలగిస్తే, ‘బంధం’ తెగిపోయినట్లే..నా!?
పునర్నవి – రాహుల్ సిప్లిగంజ్.. ఓ రేంజ్లో కెమిస్ట్రీ పండించేశారు అప్పట్లో. కేవలం వీరిద్దరి మధ్యా నడిచిన కెమిస్ట్రీని చూసేందుకు.. బుల్లితెర వీక్షులు పోటీపడేవారు.
మళ్ళీ ఇంతవరకు అలాంటి లవ్ ట్రాక్, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో రీ-క్రియేట్ చేయగలిగిన జంట ఏదీ లేదనడం అతిశయోక్తి కాదు.
