Table of Contents
The Raja Saab Trailer Review.. హర్రర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. హర్రర్ కామెడీ సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
కొత్తగా, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో హర్రర్ కామెడీని ఏం చూపించబోతున్నారు.?
ఇలాంటి డౌటానుమానాలు చాలామందికి కలగడం సహజమే. పైగా, మారుతి అంటే ఎవరు.? ప్చ్.. మారుతి ట్రాక్ రికార్డ్ చూస్తే, ప్రభాస్ ఎలా అతనికి సినిమా ఇచ్చాడన్న డౌటానుమానం వస్తుంది.
The Raja Saab Trailer Review.. యూత్‌ఫుల్.. అంటూ బూతుల్.!
మారుతి, తన సినిమాల్లో ఎక్కువగా యూత్ ఫుల్ కథాంశాల్నే ఎంచుకున్నాడు. ఫలితంగా, అవి బూతు సినిమాలైపోయాయి. అలాంటి మారుతికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం నిజంగానే ఆశ్చర్యకరం.
పైగా, ఇదొక హర్రర్ కామెడీ.. అనగానే, చాలామంది మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్.. తదితరులు ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్స్.
ఇప్పటికే వచ్చిన టీజర్ కావొచ్చు, తాజాగా విడుదలైన ట్రైలర్ కావొచ్చు.. ఎక్కడా అసభ్యతకు తావివ్వలేదు. టీజర్‌లో, మాళవిక మోహనన్ ఒకింత బోల్డ్‌గా కనిపించిందంతే.
ట్రైలర్ రివ్యూ..
సరదా సరదాగా సాగిపోతూనే, సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ‘ది రాజా సాబ్’.. విజువల్స్ అలా వున్నాయ్. ట్రైలర్‌లోనే ఇలా వుంటే, సినిమా ఇంకే రేంజ్‌లో వుంటుందో.!
ప్రభాస్ చాలా ఈజ్‌తో కనిపించాడు చాన్నాళ్ళ తర్వాత. మారుతి టేకింగ్ ప్రతి ఫ్రేమ్ వెరీ వెరీ స్పెషల్‌గా వుండేలా డిజైన్ చేసుకున్నట్లనిపిస్తుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. అస్సలెక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా సినిమాని రూపొందించినట్లుంది.
భయపెట్టిన ప్రభాస్..
అంతవరకూ సరదాగా నవ్వించిన ప్రభాస్, ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. రాక్షసుడిగా మారిపోయాడు. పుట్టలో వేలు పెడితే, కుట్టడానికి చీమనా.? రాక్షసుడ్ని.. అంటాడు ప్రభాస్.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
ఆ గెటప్.. ఆ వాయిస్.. నిజంగానే, అందర్నీ భయపడేలా చేసింది. సమ్‌థింగ్ వెరీ స్పెషల్, ఈ ‘ది రాజా సాబ్’లో ఏదో వుందని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది.
ట్రైలర్‌కి రిపీట్ వాల్యూ వుందంటే, దానిక్కారణాలు చాలానే వున్నాయి. విజువల్స్, ప్రభాస్.. అందులో వెరీ వెరీ స్పెషల్.
