తెలుగు సోయగం Ananya Nagalla: ‘లుక్కు’ అదుర్స్.! లక్కు సంగతేంటి.?
Ananya Nagalla.. అదేంటో, పొరుగింటి పుల్లకూర రుచి చాలా చాలా ఎక్కువ మన తెలుగు సినీ జనాలకి. తెలుగునాట బోల్డంత టాలెంట్ పెట్టుకుని హీరోయిన్ అనగానే, ముంబై నుంచో లేదంటే బెంగళూరు, చెన్నయ్‌ల నుంచో తీసుకొస్తుంటారు. మలయాళ ముద్దుగుమ్మలపై వున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
అనన్య నాగళ్ళ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో ‘దివ్య నాయక్’ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుందిగానీ, ఆ తర్వాత సరైన ఛాన్సులు దక్కించుకోవడంలో ఒకింత వెనుకబడిందని చెప్పక తప్పదు.
టాలీవుడ్‌లో ఇదొక విచిత్రమైన పరిస్థితి.!
నటన పరంగా వెరీ గుడ్డు.. గ్లామర్ సంగతి సరే సరి. అయినాగానీ, టాలీవుడ్ దర్శక నిర్మాతలకీ, హీరోలకీ అనన్య నాగళ్ళ సరిగ్గా ‘ఆనకపోవడం’ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
గతంలో కలర్స్ స్వాతి, శ్రీదివ్య, వేద శాస్త్రి అలియాస్ అర్చన, మధుశాలిని తదితర తెలుగు హీరోయిన్లు ఎలాగైతే తమిళ, మలయాళ, కన్నడ సినిమాలవైపు వెళ్ళి అక్కడ సక్సెస్సులు కొట్టారో, ఇప్పుడు అనన్య కూడా అదే బాటలో పొరుగు సినిమాలవైపు ఫోకస్ పెట్టక తప్పడంలేదు.
Ananya Nagalla అనన్య నాగళ్ళ.. ఆ స్టార్‌డమ్ అందుకుంటుందా.?
అన్నట్టు, హీరోయిన్ అంజలి కూడా మన తెలుగమ్మాయే, కానీ తమిళనాట హీరోయిన్‌గా మంచి విజయాల్ని అందుకుంది. తమిళ నటిగానే గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, స్టార్‌డమ్ అయితే తెచ్చుకోలేకపోయింది.
Also Read: ‘ఖిలేడీ’: స్వీటూ ఘాటూ మీనాక్షి వెరీ హాటూ.!
ఇంతకీ, అనన్య నాగళ్ళ పొరుగు ప్రయాణం ఎలా వుండబోతోంది.? ఏమోగానీ, చిన్నా చితకా తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.. ఇతర భాషల సినిమాలతోపాటు.
అనన్య నాగళ్ళ ఎంత మంచి నటి అని చెప్పడానికి ‘మల్లేశం’, ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాలే నిదర్శనం. ‘వకీల్ సాబ్’ సినిమా సంగతి సరే సరి. అయితే, గ్లామరస్ హీరోయిన్‌గా ఇంకా ఆమెకు సరైన బిగినింగ్ అయితే దొరకలేదు.
అందుకేనేమో, సోషల్ మీడియా వేదికగా అడపా దడపా తన గ్లామరస్ ఫొటోల్ని షేర్ చేస్తుంటుంది అనన్య. అందం, అభినయం.. అన్నీ వున్నా అనన్యకు లక్కు కలిసి రావడం లేదు. ఆ లక్కు కూడా కలిసొస్తే స్టార్ హీరోయిన్ అయిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.