Vijay Rashmika Engagement Gossips.. విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న చుట్టూ గాసిప్స్ కొత్తేమీ కాదు.! ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ, చాలాకాలంగా గాసిప్స్ వినిపిస్తూనే వున్నాయి.
నిన్ననే, ఇద్దరికీ అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఓ గాసిప్ కొత్తగా ప్రచారంలోకి వచ్చింది.
ఇది కేవలం గాసిప్ కాదు, నిజం.. అంటూ దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలూ విజయ్ – రష్మిక ఎంగేజ్మెంట్ వార్తల్ని ‘కన్ఫామ్’ చేసేశాయి.
Vijay Rashmika Engagement Gossips.. నిజమేనా.? నిజమైతే, ఎందుకింత సస్పెన్స్.?
ఇటు విజయ్, అటు రష్మిక.. ఇద్దరూ, ఏ విషయాన్నీ దాచే రకం కాదు. కాకపోతే, ఇద్దరి మధ్యా స్నేహం వుంది.. ఆ విషయాన్ని ఇద్దరూ చాలా సందర్భాల్లో ఓపెన్‌గానే చెప్పారు.
‘గీత గోవిందం’ సహా పలు సినిమాల్లో విజయ్ – రష్మిక కలిసి నటించిన విషయం విదితమే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.

ప్రొఫెషనల్ లైఫ్ వేరు, స్నేహం వేరు, ప్రేమ వేరు, పెళ్ళి వేరు.! పెళ్ళి పీటలెక్కడానికి తగిన ముహూర్తం చూసుకోవాలి. ఎంగేజ్మెంట్నీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకోవాలి.
సో, వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం.. అందుకే, న్యూస్ బయటకు పొక్కకుండా అత్యంత సన్నిహితుల నడుమ, ఎంగేజ్మెంట్ చేసుకుని వుండొచ్చేమో.!
నిజం కాకపోతేనో.?
తూచ్.. అదంతా ఉత్తదే.! అని రాత్రికి రాత్రి, ఇరువురూ స్పష్టతనిచ్చేస్తోనో.! గతంలో చాలా సార్లు జరిగిందిలా. సో, రష్మిక – విజయ్ మధ్య ఏం జరుగుతోందన్నది ఊహించడం అంత తేలిక కాదు.
Also Read: జూనియర్ ఎన్టీయార్‌ని ఎవరూ ఆపలేరు.!
రష్మిక తన సినిమాలతో బిజీగా వుంది. విజయ్ దేవరకొండ సంగతి సరే సరి. ఇద్దరూ తమ స్నేహాన్ని పెళ్ళి పీటల వరకూ తీసుకెళ్ళాలనుకుంటే, బహిరంగంగా చెప్పే చేస్తారు కూడా.!
అధికారిక ప్రకటన వచ్చే వరకూ, విజయ్ దేవర కొండ – రష్మిక మండన్న విషయంలో ‘ఎంగేజ్మెంట్’ ప్రచారాల్ని నమ్మేయలేం.!
