Table of Contents
సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ (Puri Jagannath) ఏం చేసినా అదొక సంచలనమే. ఇప్పుడంటే సక్సెస్‌ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. కానీ, ఒకప్పుడు సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్ (iSmart Shankar) అనిపించుకున్నాడు.
చాలా మంది దర్శకులతో పోల్చితే పూరీ జగన్నాధ్ (Puri Jagannath) సమ్‌థింగ్ డిఫరెంట్. టైటిల్ దగ్గర్నుంచే పూరీ స్మార్ట్ థింకింగ్ మొదలవుతుంది. అయితే, ఎందుకో ఈ మధ్య పూరీ సినిమాల్లో అతని మార్క్ ఫ్లేవర్ మిస్ అవుతోంది.
హీరోల గెటప్పుల మీద, హీరోయిన్ల గ్లామర్ మీదా ఫోకస్ ఎక్కువై, కథా, కథనం మీద ఫోకస్ తగ్గించేస్తున్నాడేమో అంటారు కొందరు. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.
కానీ, ఫ్లాప్ అవుతుంది అని తెలిసి ఎవరైనా చెత్త కథతో సినిమా తీస్తారా.? అని పూరీ జగన్నాధ్ (Puri Jagannath) స్వయంగా ప్రశ్నిస్తాడు కూడా. అదీ నిజమే. కొన్నిసార్లు ఈక్వేషన్స్ కలిసి రావు. అసలు ‘పోకిరి’ అంత పెద్ద హిట్ ఎలా అయ్యిందో ఇప్పటికీ తనకి అర్ధం కాదంటాడు ఈ సంచలన దర్శకుడు.
సక్సెస్ చూసి పొంగిపోవడం, విర్రవీగడం.. ఫెయిల్యూర్ రాగానే కుంగిపోవడం వంటివి పూరి జగన్నాథ్ డిక్షనరీలో లేని విషయాలు. తన పని తాను చేసుకుపోవడం మాత్రమే పూరి జగన్నాథ్ (Puri Jagannath) కి తెలిసిన విద్య. అయితే, అతన్నుంచి అద్భుతమైన సినిమాల్ని అభిమానులు ఆశించడం తప్పు కాదు కదా.
ఇస్మార్ట్ పూరి జగన్నాథ్.. iSmart Shankar
వరుస వైఫల్యాల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni RAPO) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agerwal), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) కథ ఇదేనంటూ చాలా గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. ఆ కథ సంగతి పక్కన పెడితే, లేటెస్ట్‌గా విడుదలైన ఆడియో సింగిల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఆడియో సింగిల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం.
టీజర్ విషయానికొస్తే, ఇస్మార్ట్ హైద్రాబాదీ (iSmart Hyderabadi) అనే తరహాలో రామ్ పాత్రని దర్శకుడు పూరీ జగన్నాధ్ తీర్చి దిద్దిన వైనం సింప్లీ సూపర్బ్. కంప్లీట్‌గా రామ్ పోతినేని (Ram Pothineni) బాడీ లాంగ్వేజ్ మారిపోయింది.
అచ్చంగా పూరీ (Puri Jagannath) సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలా తయారైపోయాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni RAPO).
హీరోయిన్లు కూడా ఇస్మార్టేనండోయ్.. iSmart Shankar
హీరో రామ్ పోతినేని (Ram Pothineni) మాత్రమే కాదు, ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) కూడా పక్కా హైద్రాబాదీ పోరీలా మారిపోయినట్లుంది. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకమట.
మరో హీరోయిన్ నిధి అగర్వాల్ సంగతి సరే సరి. అటు నభా నటేష్, ఇటు నిధి అగర్వాల్.. ఇద్దరు ఇస్మార్ట్ భామలతో ఇస్మార్ట్ శంకర్.. అదేనండీ రామ్ పోతినేని ఇస్మార్ట్ రొమాన్స్ ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఆడియో సింగిల్స్.. అదరహో
ఇప్పుడిక ఆడియో సింగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే విడుదలైన ఆడియో సింగిల్స్‌లో ఒకటి ‘మాస్ ఊరమాస్..’ కాగా, మరొకటి ‘అల్ట్రా హాట్..’. తొలి ఆడియో సింగిల్ ‘దిమ్మాక్ ఖరాబ్..’ (Dimmak Kharab) విషయానికొస్తే, మాస్ బీట్ అదిరిపోయింది. లిరిక్స్ కెవ్వుకేక.
ఈ తరహాలో ఇంత మాస్ సాంగ్ వచ్చి ఎన్నాళ్లయ్యిందో ఏమో. మణిశర్మ (Mani Sharma) ఆ స్థాయిలో తన మ్యాజిక్ చూపించాడు. సినిమాటోగ్రఫీ సహా అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి ఈ పాటకి. నిధి, నభా సొగసులు, రామ్ (Ram Pothineni) స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
మరో సింగిల్ ‘జిందాబాద్.. జిందాబాద్’ (Zindabad Zinadabad) గురించి మాట్లాడుకోవల్సి వస్తే, పూరీ జగన్నాధ్ (Puri Jagannath) సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే హాటెస్ట్ సాంగ్‌ని తలపించింది. నభా నటేష్, రామ్ మధ్య రొమాన్స్ నభూతో న భవిష్యతి అనేలా ఉంది.
ఆడియో సింగిల్స్‌తోనే అదీ.. ఈ రెండింటితోనే ఈ స్థాయిలో స్వీట్‌గా దిమాక్ ఖరాబ్ చేసి, జిందాబాద్ ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అనిపించిన పూరీ జగన్నాధ్ (Puri Jagannath) ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్టు కొడతాడో కానీ, అంచనాల్ని మించి రెస్పాన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. పూరీ జగన్నాధ్, ఛార్మి (Charmy Kaur) ఈ సినిమాకి నిర్మాతలు.