Pawan Kalyan Uppada Development.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజక వర్గంలో వున్న ఓ చిన్న గ్రామం ఉప్పాడ. ఉప్పాడ పేరు చెప్పగానే, అక్కడి చీరలు గుర్తుకొస్తాయి మహిళా మణులకి.
కానీ, ఉప్పాడ.. అంటే, అది సముద్ర తీర ప్రాంతం. అత్యంత అందంగా వుంటుంది ఉప్పాడ నుంచి కాకినాడ వరకూ వెళ్ళే రహదారి. సముద్ర తీరానికి అనుకుని వుంటుంది ఆ రహదారి.
పర్యాటకం కోణంలో పిఠాపురం – ఉప్పాడ – కాకినాడ.. ఈ బెల్ట్‌ని అభివృద్ధి చేస్తే, ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆస్కారమేర్పడుతుంది.
Pawan Kalyan Uppada Development.. దశాబ్దాలుగా నిర్లక్ష్యం..
ఉప్పాడ, సమీప ప్రాంతాల్లో మత్స్యకారులు ఎక్కువగా వుంటారు. వారి సమస్యల్ని ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న దాఖలాల్లేవు.
తాజాగా, మత్స్యకారులు తమ సమస్యల్ని ఏకరువు పెడుతూ, ఆందోళనలకు దిగారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు స్థానిక ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు,. స్వయంగా ఉప్పాడకు వెళ్ళారు. ఉప్పాడ కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
Also Read: రాజకీయాల్లోకి చిరంజీవి ‘రీ-ఎంట్రీ’ తప్పదా.?
పరిశ్రమల కారణంగా సముద్ర జలాలు కలుషితమవడంపై మత్స్యకారుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తనకు వంద రోజుల సమయం ఇవ్వాలనీ, ఈలోగా అన్ని సమస్యలూ చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాననీ, మరోమారు ఉప్పాడకు వస్తాననీ పవన్ కళ్యాణ్ చెప్పారు.
‘నన్ను మీ భుజానికెత్తుకుని మోశారు.. మీరు ఓ మాట నన్ను అంటే, నేను పడతాను. మీలో ఒకడ్ని నేను. మీ కోసం పని చేస్తాను..’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

హెలికాప్టర్‌లో ఉప్పాడ సముద్ర తీరాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, అధికారులతో మత్స్యకారుల సమస్యలపై సమీక్షించారు.
తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం కలిగిందని మత్స్యకారులు, పవన్ కళ్యాణ్ పర్యటనపై వ్యాఖ్యానించడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ రాకతో మారిన పిఠాపురం..
ఇప్పటికే, పిఠాపురం నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో పవన్ కళ్యాణ్ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మళ్ళీ వచ్చినప్పుడు, పడవలో సముద్రంలో మత్స్యకారులతో కలిసి పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం గమనార్హం.
ఉప్పాడ పర్యటన సందర్భంగా, పలు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించారు.
