Table of Contents
Best Cooking Oil Healthy.. పామాయిల్ మంచిది కాదు.. సన్‌ఫ్లవర్ ఆయిల్ బెటర్.! రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మంచిది. ఆలివ్ ఆయిల్ అయితే, ఇంకా బెటర్.. కానీ, ఖరీదెక్కువ.!
కొబ్బరి నూనె సంగతేంటి.? అబ్బో, ఆ కేరళలో ఎలా తింటారో మలయాళీలు.. కొబ్బరి నూనెతో వంటకాల్ని మనం తినలేం.!
వంట నూనెలతో జాగ్రత్త.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.! ఎక్కువగా వేపుడు వైపు ఆలోచనే చేయొద్దు.! ఎన్నెన్ని జాగ్రత్తలు.? ఎన్నెన్ని కబుర్లు.!
పాపాలు చేస్తే, నరకంలో యమ భటులు మనల్ని మరుగుతున్న నూనెలో వేయించేస్తారట.. అలాగని, చాలా సినిమాల్లో చూశాం.
మరి, మనం ఏం పాపం చేశామని, కల్తీ వంట నూనెల్ని కొనుక్కుని మరీ.. వాటితో వంటకాలు చేసుకుని తింటున్నాం.? లాజిక్కే కదా.!
Best Cooking Oil Healthy.. ఇంతకీ, వంట నూనెల్లో ఏదైతే మంచిది.?
ముందే చెప్పుకున్నట్లు.. ఏది మంచిదన్న కోణంలో జుట్టు పీక్కోవడం అనవసరం. ఏ వంట నూనె అయినాసరే, పరిమితంగానే వంటకాల్లో వినియోగించాలి.
అలా ఎలా కుదురుతుంది.? పూరీ తినాలనుకుంటే, సలసల కాగే నూనెలో వేయించాల్సిందే కదా.? బూరెలైనా, గారెలైనా.. తప్పదు కదా.!

అలాంటప్పుడు, నూనెల్లో ఏది తక్కువ హాని చేస్తుందో, దాని వైపు మొగ్గు చూపడం బెటర్. ఈ విషయమై వైద్య నిపుణుల సూచనల్ని, సలహాల్ని తప్పక పాటించాల్సిందే.
శరీరంలో పేరుకు పోయిన కొవ్వులు, వాటిల్లో మంచి కొవ్వులు, చెడు కొవ్వులు.. వీటిపైన అవగాహన తప్పనిసరి.
రోజువారీ శరీరానికి ఎంత వరకు శక్తి అవసరం.? ఎంత మేర ఆ శక్తిని వినియోగిస్తున్నాం.? ఇవన్నీ లెక్కలేసుకుంటే, వంట నూనెల్ని తదనుగుణంగా ఉపయోగించుకోవచ్చు.
సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిదే. పామాయిల్ వినియోగం అంత శ్రేయస్కరం కాదు. కానీ, పిండి వంటలకు.. అదే మంచిదని అంటుంటారు కొందరు.
ఇక, రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మంచిదే. కాకపోతే, దీన్ని కూడా మితంగానే వాడాల్సి వుంటుంది. వేరు శనగ నూనెకి కూడా ఇదే వర్తిస్తుంది.
కల్తీ కాటు.. తప్పించుకునేదెలా.?
ఇది మాత్రం కష్టమైన వ్యవహారమే.! కల్తీ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడెరూ, లూజ్ వంట నూనె వాడటంలేదు.
ప్యాకింగ్ వంట నూనెల్నీ.. అందునా, బ్రాండెడ్ వంట నూనెల్నే వాడుతున్నాం. అయినా, అవి కూడా కల్తీ బారిన పడుతున్నాయి. కాదేదీ కల్తీకి అనర్హం.. అన్న విషయాన్ని గుర్తెరగాలి.

ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.. వేపుళ్ళు తగ్గించుకోవాలి.. అనగా, వాటి మీద ఇష్టాన్ని చంపేసుకోవాలి. పూరీ, గారెలు, బూరెలు.. వీటి విషయంలోనూ అంతే.
ఈ మధ్యన, కోల్డ్ ప్రెస్డ్ నేచురల్లీ ప్రాసెస్డ్ కుకింగ్ ఆయిల్.. అంటూ, ఓ హడావిడి జరుగుతోంది. వాటి విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.
నీ ఆరోగ్యం.. నీ బాద్యత.!
ఎవరో ఏదో చెప్పారని, అదే మంచిదని ‘అతి’ చేస్తే, మీ కొంప మునిగిపోద్ది జాగ్రత్త.! ఇప్పుడేదీ, ‘నేచురల్లీ’ అనడానికి వీల్లేదు. అది మాత్రం గుర్తెరగాలి.
Also Read: ‘కరుంగళి మాల’ ప్రాముఖ్యత ఏంటి? ఎవరు, ఎందుకు ధరించాలి.?
మార్కెట్‌లో పల్లీల (వేరు శనగలు) ధర ఎంత.? వాటిని ప్రాసెస్ చేస్తే వచ్చే నూనె పరిమాణమెంత.? వేరు శనగ నూనె ప్యాకెట్ ధర ఎంత.? లెక్క తీస్తే, షాక్ అవుతారు ఖచ్చితంగా.
ఫైనల్ టచ్: ఏ వంట నూనె బెటర్.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. మితంగా.. చాలా పరిమితంగా మాత్రమే వంట నూనెల్ని వినియోగించడం బెస్ట్ అని మాత్రం చెప్పగలం.
