Table of Contents
Nara Lokesh Visakhapatnam Development.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.! రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు.!
సమయం పడుతుంది.. ఐదేళ్ళలో సాధ్యం కాకపోయినా, పదేళ్ళకైనా, అభివృద్ధి అనేది జరిగి తీరాలి.!
మరి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో హైద్రాబాద్ తర్వాత రెండో ఆర్థిక శక్తిగా వుంటూ వచ్చిన విశాఖపట్నం, విభజన తర్వాత కూడా ఎందుకు అభివృద్ధి చెందలేకపోయింది.?
ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం.. వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం. ఆ ఉత్తరాంధ్రలో వుండటమే విశాఖకి శాపం.
విశాఖలో ఏమేమున్నాయ్.?
విశాఖపట్నంలో జాతీయ సంస్థలున్నాయ్. అంతర్జాతీయ విమానాశ్రయం వుంది. దేశానికే తలమానికమైన నౌకాశ్రయం వుంది. స్టీల్ ప్లాంట్ కూడా వుంది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం, నగరానికి ఆనుకుని సుదీర్ఘ సముద్ర తీరం, ఎర్రమట్టి దిబ్బలు, కైలాసగిరి.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దది.

కూతవేటు దూరంలో అరకు అందాలు, లంబసింగి తదితర ప్రాంతాలు ప్రకృతి ప్రేమికుల్ని కట్టి పడేస్తాయ్. పర్యాటకంగా విశాఖ కంటే అనువైన ప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెక్కడుంది.?
Nara Lokesh Visakhapatnam Development.. అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని..
అసలు, విశాఖపట్నంలో ఏం లేదు.? అని అడగాలి. ఎందుకంటే, అన్నీ వున్నాయి గనుక. అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది పరిస్థితి.
విభజన తర్వాత, విశాఖపట్నంకి రాజధాని అయ్యే అవకాశం వచ్చింది. అనివార్య కారణాల వల్ల విశాఖ, రాజధాని కాకుండా పోయింది.
రాజధాని కాకపోతేనేం, విశాఖ అభివృద్ధికి కుప్పలు తెప్పలుగా అవకాశాలున్నాయి. కానీ, విశాఖ పట్ల పాలకుల్లో అంతులేని నిర్లక్ష్యం. అదే విశాఖకి శాపం.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలోగానీ, 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ హయాంలోగానీ, జరగాల్సిన స్థాయిలో విశాఖ అభివృద్ధి జరగలేదు.
తాజాగా, మంత్రి నారా లోకేష్, ‘విశాఖ అభివృద్ధికి పదేళ్ళు సరిపోతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళు అంటే, దశాబ్దం.!
అంతులేని నిర్లక్ష్యం.. విశాఖకు శాపం
గత టీడీపీ హయాంలో ఐదేళ్ళను కలుపుకుంటే, దాంతోపాటు గడచిన ఏడాదిన్నర కాలాన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆరున్నరేళ్ళలో విశాఖని ఏం అభివృద్ధి చేశారన్నది నారా లోకేష్కే తెలియాలి.

అంతకు ముందూ టీడీపీ తొమ్మిదేళ్పపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ కాలమూ విశాఖ అభివృద్ధికి సరిపోలేదు.!
ఎంత కాలం పడుతుంది విశాఖ అభివృద్ధికి.? అంటే, సమయం, నిథులు.. వీటితోపాటు చిత్తశుద్ధి అనేది ముఖ్యమని పాలకులు ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.!
విశాఖ అభివృద్ధి అంటే, వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి. అంతే కాదు, విశాఖ అభివృద్ధి అంటే, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అని అర్థం.! అది పాలకులకు ఎప్పుడర్థమవుతుందో ఏమో.!
