Mouni Roy Karva Chauth.. ‘తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమూ.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమూ..’ అని పాట గుర్తొస్తుంది కదా.!
ఈ ఫోటోలోని పోజులు చూస్తుంటే. ఎవరికైనా ఆపాతమధురం ఖచ్చితంగా గుర్తు రావల్సిందే.
తెల్ల చీరలో ఇంత ట్రెడిషనల్‌గా వున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారుగా.! బుల్లి తెర ప్రేక్షకులకైతే ‘నాగిని’గా గుర్తింపు.
పెద్ద తెర ప్రేక్షకులకు హీరోయిన్గా స్పెషల్ ఐటెం గాళ్‌గా బోలెడంత పాపులారిటీ వుంది ఈ ముద్దుగుమ్మకి.
అదేనండీ మౌనీ రాయ్ గురించే మాట్టాడుకోబోతున్నాం. బుల్లితెరపై అందమైన హీరోయిన్గా ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మకు సల్మాన్ ఖాన్ రూపంలో అదృష్టం వరించింది.
Mouni Roy Karva Chauth.. అదృష్టం అప్‌గ్రేడ్ అయ్యిందలా.!
సల్మాన్ ఖాన్ ద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకుంటోంది.
అలాగే, స్పెషల్ సాంగ్స్‌లో తనదైన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది మౌనీ రాయ్. ‘కేజీఎఫ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో సౌత్ ఇండస్ర్టీని టచ్ చేసింది.

ప్రస్తుతమైతే, మెగా ఛాన్సే కొట్టేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’లో స్పెషల్ సాంగ్ చేస్తోంది మౌనీ రాయ్.
ఫెస్టివల్ వైబ్స్..
ఇక, మౌనీరాయ్‌కి వున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడే హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. అప్డేట్ వెర్షన్లో వుంటూ వుంటుంది మౌనీ రాయ్.
తాజాగా తెల్ల చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు తురుముకుని, చేతులకు ఎర్రని పారాణి పూసుకుని అందంగా ఫోటో సెషన్ చేయించుకుంది.
Also Read: దీపావళి టపాసులపైనే ఆంక్షలు.! ప్రతిసారీ ఎందుకీ రచ్చ.?
బికినీలతో పాటూ, ఇన్నోవేటివ్ అవుట్ ఫిట్స్‌తో సోషల్ మీడియాని హీటెక్కించే మౌనీరాయ్ ఇలా ట్రెడిషనల్ టచ్ ఎందుకిచ్చిందంటారా.?
రీసెంట్గా జరిగిన నార్త్ ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్ కర్వా చౌత్ సందర్భంగా మౌనీరాయ్ ఈ గెటప్‌లో దర్శనమిచ్చింది. అలా ఈ స్పెషల్ ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోందన్న మాట.
