Table of Contents
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal).. పరిచయం అక్కర్లేని పేరిది. తెలుగు ప్రేక్షకులు అందాల చందమామగా (Kajal Aggarwal movies) పిలుచుకుంటారు.
‘మిత్రవింద’ (Kajal Aggarwal movies) గా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటించింది.
అయితే, తమిళ, హిందీ సినిమాల కన్నా తెలుగు సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ అందమైన చందమామ (Andala Chandamama). దాదాపు 12 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన కెరీర్ ఈమె సొంతం. ఇప్పటికీ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ తగ్గలేదు.
తెలుగులో ఆమె స్టార్‌డమ్‌కి తిరుగు లేదు. ఫ్లాప్‌లొచ్చిన ప్రతిసారీ కాజల్ పనైపోయిందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూ కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఈ బ్యూటీ.
కాజల్ అగర్వాల్ గురించిన ఆశక్తికరమైన విషయాలు.. (Kajal Aggarwal movies)
నటిగా కాజల్ అగర్వాల్ తొలి సినిమా ‘క్యూ హోగయానా’. ఇది బాలీవుడ్ సినిమా. ఐశ్వర్యారాయ్ స్నేహితురాలిగా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కాజల్ నటించింది.
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తొలి సౌత్ సినిమా ‘బొమ్మలాట్టమ్’ (Bommalattam). తమిళంలో భారతీరాజా (Bharatee Raja)ఆమెకు తొలి అవకాశమిచ్చారు.
అయితే, కాజల్ నటించగా విడుదలైన తొలి సౌత్ సినిమా మాత్రం ‘లక్ష్మీ కళ్యాణం’. తేజ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఆ తర్వాత తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది కాజల్.
అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కి తొలి సక్సెస్ తెలుగులోనే వచ్చింది. అదే ‘చందమామ’. ఆ తర్వాత ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ‘మగధీర’.
మగధీరతో మిత్రవింద దశ తిరిగిందంతే.. (Kajal Aggarwal movies)
ఇక అక్కణ్ణించి కాజల్ (Kajal Aggarwal movies) వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. ఒక్కో హీరోతోనూ రెండు, మూడు ఆ పైన హిట్లున్నాయి కాజల్‌కి. చరణ్‌తో ‘మగధీర’ సినిమా చేసిన కాజల్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
మెగా కాంపౌండ్‌లో కాజల్ అగర్వాల్‌కి బోలెడన్ని హిట్లున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్.. ఇలా నలుగురు అగ్రహీరోలతోనూ హిట్లు కొట్టేసింది.
ఎన్టీఆర్, ప్రబాస్, మహేష్, రామ్, నితిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు టాలీవుడ్‌లో అందరి హీరోలతోనూ కాజల్ నటించేసినట్లే. ఏమో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతోనూ కాజల్ సినిమాలు చేసేస్తుందేమో.
తమిళంలో పలువురు అగ్ర హీరోలతో సూపర్ హిట్లు కొట్టింది కాజల్. విజయ్, అజిత్, సూర్య, కార్తి, విశాల్.. ఇలా దాదాపు అందరితోనూ తమిళంలో సక్సెస్‌లు కొట్టింది.
బాలీవుడ్ కలిసిరాలేదీ చందమామకి..
సౌత్‌లో స్టార్‌డమ్ వచ్చాక, బాలీవుడ్‌కెళ్లి ‘సింగం’ సినిమా చేసింది. కానీ, ఎందుకో ఆమెకి (Kajal Aggarwal movies) బాలీవుడ్ వాతావరణం సరిగ్గా పడలేదు. మళ్లీ సౌత్‌తోనే బిజీ అయిపోయింది.
కాజల్ సినీ పరిశ్రమలోకి తన సోదరిని తీసుకొచ్చింది. కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలుగుతో పాటు, తమిళంలోనూ నటించింది. కానీ, కెరీర్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాకపోవడంతో, నటనకు గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కాజల్ మాత్రం ఇప్పుడప్పుడే తనకు పెళ్లి ఆలోచన లేదంటోంది.
కాజల్ గ్లామర్ సీక్రెట్..
నవ్వుతూ, ఆనందంగా జీవితాన్ని గడపడమే గ్లామర్ సీక్రెట్ అని కాజల్ చెబుతుంటుంది.
ఫిట్‌నెస్ గురించి అడిగితే, అవసరమైనంత వరకూ వర్కవుట్స్ చేస్తుందట. మితాహారమే తన ఆరోగ్య సూత్రమని కాజల్ చెబుతుంటుంది.
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గ్లామర్ ప్రపంచంలో వుంటూ.. వివాదాల జోలికి వెళ్ళకుండా, ఎఫైర్స్.. అంటూ గాసిప్స్ కాలమ్స్‌కి ఎక్కకుండా ఇన్నేళ్ళ కెరీర్‌లో ‘క్లీన్’ (Kajal Aggarwal movies) అన్పించుకోవడం.
కాజల్‌కి సినీ పరిశ్రమలో చాలామంది స్నేహితులున్నారు.. అందులో హీరోయిన్లే కాదు, హీరోలూ వున్నారు. కానీ, కాజల్ స్టిల్ సింగిల్.. వితౌట్ ఎనీ ‘ఎఫైర్’ గాసిప్స్.