Nara Lokesh Porugu Mirchi.. టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారన్నది తెలిసిన విషయమే.
మంత్రిగా విధి నిర్వహణలో బిజీగా వుంటూనే, సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సాయం కోసం అభ్యర్థిస్తే, సానుకూలంగా స్పందించడంలోనూ ముందుంటారాయన.
రాజకీయ విమర్శలు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా సోషల్ మీడియా వేదికగా, ఆయా అంశాల్ని నారా లోకేష్ ప్రస్తావిస్తుంటారు.
Nara Lokesh Porugu Mirchi.. పొరుగు కారం.!
తాజాగా, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయమై నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ‘పొరుగు రాష్ట్రాలకు మంటగా వుంది’ అని పేర్కొన్నారు నారా లోకేష్ ఆ ట్వీటులో.
ఆంధ్ర ప్రదేశ్ అంటే, స్పైసీ ఫుడ్‌కి కేరాఫ్ అడ్రస్ అనీ, పెట్టుబడుల విషయంలోనూ అది ప్రూవ్ అయ్యిందనీ, ఇది పొరుగు రాష్ట్రాలకు రుచించడంలేదనీ.. ఇదీ నారా లోకేష్ ట్వీటు సారాంశం.
దాంతో, స్వపక్షం.. అనగా ఆంధ్ర ప్రదేశ్ నుంచీ, విపక్షం.. అనగా పొరుగు రాష్ట్రాల నుంచీ నారా లోకేష్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది టీడీపీ శ్రేణులకు అస్సలు రుచించడంలేదు.
పోటీ.. ఎంతవరకు.?
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలతో పోల్చితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చాలా అంశాల్లో వెనుకబడివుంది.
అసలంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సరైన రాజధానే లేదు. ఈ క్రమంలో, మంత్రిగా నారా లోకేష్ ఇతర రాష్ట్రాల గురించి కామెంట్ చేసేటప్పుడు, ఇంకాస్త హుందాతనంతో వ్యవహరించి వుంటే బావుండేది.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే, ఎవరు మాత్రం స్వాగతించకుండా వుంటారు.? అయితే, పొరుగు రాష్ట్రాల తరహాలో ఆంధ్ర ప్రదేశ్, ఆ పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతోందా.?
Also Read: బిగ్ క్వశ్చన్.! మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాకాశాల కోసం రాష్ట్ర యువత ఎక్కువగా పొరుగు రాష్ట్రాల మీదనే ఆధారపడుతోందన్న వాస్తవాన్ని నారా లోకేష్ విస్మరిస్తే ఎలా.?
ఎదిగినా ఒదిగే వుండాలి.! ఎదిగే క్రమంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పొరుగు రాష్ట్రాల సహకారం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అవసరమే.!
ఉత్సాహం మంచిదే.. అత్యుత్సాహమే కొంప ముంచుతుంది.!
