Kiran Abbavaram KRamp Review.. కిరణ్ అబ్బవరం తాజా సినిమా ‘కె-ర్యాంప్’ ప్రేక్షకుల ముందుకొచ్చిది. ‘కె-ర్యాంప్’ అని దేనికి వాడతారో, నేటితరం యూత్‌కి బాగా తెలుసు.!
యూత్‌ఫుల్ మూవీ.. అన్నారంటే, ఉద్దేశ్యం ‘కె-ర్యాంప్’ అనే.! ఇంతకీ, ‘కె-ర్యాంప్’ ఆడేశాడా కిరణ్ అబ్బవరం.? బూతుల కాంట్రవర్సీ సంగతేంటి.?
బూతు సినిమా.. అని అర్థం వచ్చేలా సినిమా ప్రమోషన్లు చేసి, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.. అంటే, ఎవరైనా నమ్ముతారా.? అసలేముంది ‘కె-ర్యాంప్’ సినిమాలో.!
Kiran Abbavaram KRamp Review.. కథ కమామిషు.. ఇదీ.!
చాలా సినిమాల్లోలానే, ఈ సినిమాలో కూడా హీరో జస్ట్ బలాదూర్ అంతే.! అతన్ని ఓ సందర్భంలో ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది హీరోయిన్.!
షరామామూలుగానే, ఆ హీరోయిన్‌తో మన హీరో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే, ఆ హీరోయిన్‌కి ఓ సమస్య వుంటుంది. ఆ సమస్యని, మన హీరో ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.!
అబ్బో, బోల్డన్ని సినిమాలు చూసేశాం.. ఇలాంటి కథలతో.. అంటారా.? అయితే, అది మీ తప్పు కాదు.! కథ కొత్తది కాదు, కథనమూ కొత్తది కాదు.!
కాకపోతే, హీరోయిన్‌ది కొత్త సమస్య.! ఆ సమస్యని బహుశా కక్కుర్తితోనే రాసి వుంటాడు దర్శకుడు కథలో.! ఆ కక్కుర్తికి తగ్గట్లే, తెరపై ప్రవర్తిస్తారు హీరో హీరోయిన్లు.!
సీనియర్ నటుడు నరేష్, ఇందులో ప్లే-బాయ్ తరహా క్యారెక్టర్ ప్లే చేశాడు. వయసు మీద పడింది కదా, ఒకింత హుందాగా వుండక్కర్లా.? అనడగొద్దు.!
ప్లే-బాయ్ పాత్రలో నరేష్ చెలరేగిపోయాడు. బూతులు బాబోయ్ బూతులు.. అంతే.! నాన్సెన్స్.. అని సినిమాలో చాలాసార్లు అనిపిస్తుంటుంది.
అంతలా ఓ వైపు హీరో, ఇంకో వైపు నరేష్.. హద్దులు దాటేశారు. హీరోయిన్ గ్లామర్, ఇతరత్రా వ్యవహారాల్లో చెలరేగిపోయింది.
ప్రోమోస్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ‘ఆ తరహా’ కంటెంట్ వుంది. పోనీ, అదేమన్నా ఎట్రాక్టివ్‌గా వుందా.? అంటే, చిరాకు తెప్పిస్తుంది తప్ప, అందంగా వుండదు.
పాటల్లో కిరణ్ అబ్బవరం డాన్స్ బాగా చేశాడు. ఒకింత ఎనర్జిటిక్‌గానే కనిపించాడు తెరపై.
హీరోయిన్ అందంగా కనిపించింది.. గ్లామర్ డోస్ ఎక్కువైంది. వెన్నెల కిషోర్ తదితరులు కొన్ని నవ్వులు పూయించారు.
అయితే, కామెడీ.. అనుకుని, కితకితలు పెట్టుకుని నవ్వుకోవాల్సిందే తప్ప, ఇందులో ‘హెల్తీ’ కామెడీ అనేది అస్సలు కనిపించదు.
నరేష్ పాత్రని డిజైన్ చేసిన తీరు, ఆ పాత్ర ప్రదర్శించిన అతి.. మొత్తంగా సినిమాకి శాపంగా మారింది.
అక్కడికేదో గొప్ప క్యారెక్టర్ చేసేసినట్లు, ప్రెస్ మీట్స్‌లోనూ నరేష్ చూపించిన అతి, చాలా ఛండాలంగా తయారయ్యింది.
దీపావళి విన్నర్.. అంటూ, ఆల్రెడీ సక్సెస్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఇంకోపక్క, రివ్యూలు సరిగ్గా రాయలేదంటూ నిర్మాత, దర్శకుడు, హీరో గుస్సా అవుతున్నారు.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఫ్రీ టిక్కెట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దండిగా పంచి, థియేటర్లకు ఆడియన్స్‌ని రప్పించారు. వాళ్ళతోనే, సినిమా బావుందనీ చెప్పించే ప్రయత్నం చేశారు.
పండగ సందడి కదా.. థియేటర్లకు జనం వెళ్ళడం సహజం. వెళ్ళాక, నిట్టూరుస్తూ బయటకు రావడం కూడా సహజమే.!
చివరగా.. ఇది కామెడీ ర్యాంప్ కాదు.. కామమ్ ర్యాంప్.! జస్ట్ కక్కుర్తి కోసమే సినిమా చేసినట్లుంది.
