చక్కటి ‘ప్రేమ విమానం’.! ఇది నా అభిప్రాయం.!

 చక్కటి ‘ప్రేమ విమానం’.! ఇది నా అభిప్రాయం.!

Prema Vimanam Review Mudrabhiprayam

Prema Vimanam Review Mudrabhiprayam.. సినిమా అంటే.. థియేటర్లో కూర్చున్నంత సేపూ హాయిగా వుండాలి.! తెరపై పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి.!

థియేటర్లు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఓటీటీ అనేది సినిమాలకు మంచి వేదికగా మారింది.!

అసలు విషయానికొస్తే, థియేటర్‌కి వెళ్ళి సినిమాలు చూసే తీరిక, ఓపిక లేక.. ఓటీటీని తిరగెయ్యడం పరిపాటిగా మారిపోయింది.

‘ఏం చూస్తాంలే.. అన్నీ చెత్త సినిమాలు..’ అన్న భావన పెద్ద సినిమాల విషయంలోనూ, చిన్న సినిమాల విషయంలోనూ కలుగుతోంది.

Prema Vimanam Review Mudrabhiprayam.. ఏదో అలా అనుకోకుండా.. విమానమెక్కేస్తే..

అలా అనుకోకుండా, ‘ప్రేమ విమానం’ సినిమా కనిపిస్తే, ఓ పది పదిహేనుసార్లు లైట్ తీసుకున్నాను. కానీ, ఎందుకో పదే పదే అదే పోస్టర్ కనిపిస్తూ వచ్చేసరికి, ఒక ‘ట్రై’ ఇద్దామనుకున్నానంతే.!

స్టార్ట్ అయ్యాక.. ఎక్కడా ఆపాలనిపించలేదు.! ఓ క్యూట్ అవ్ స్టోరీ.. చిన్న పిల్లలైన ఇద్దరు అన్నదమ్ముల ‘విమానం’ స్టోరీ.. రెండిటినీ భలే మిక్స్ చేశారు.

పేద రైతు కష్టాలు మరీ అంత కష్టంగా చూపించలేదు.! రైతు ఉరేసుకోవడం కష్టం కాదా.? అంటే, కష్టమేగానీ.. చూసే ప్రేక్షకుడ్ని మరీ అంతలా కష్టపెట్టి.. మెలిపెట్టేయలేదు.!

మన ఇంట్లోనే.. మన స్నేహితుల మధ్యన..

చిన్న పిల్లలిద్దరూ మాట్లాడుకుంటోంటే, చిన్నప్పుడు.. మన ఇంట్లోనో, మన స్నేహితుల మధ్యనో ఇలాంటి సంభాషణలు వింటున్నట్టే అనిపించింది.

లీడ్ పెయిర్ మధ్య ప్రేమ కూడా అంతే.! సినిమాటిక్‌గా లేదని కాదుగానీ, వున్నా.. క్యూట్‌గానే అనిపించింది. మ్యూజిక్ కావొచ్చు, సినిమాటోగ్రఫీ కావొచ్చు.. అవసరానికి తగ్గట్టే వున్నాయ్.

అనసూయ భరద్వాజ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్.! కాకపోతే, ఇంకా చాలా చేయగలదామె. ఆ పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేదేమో అనిపించింది.

హీరో తల్లిదండ్రులు, హీరోయిన్ తల్లిదండ్రులు.. ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎక్కడా ‘అతి’ కనిపించలేదు. చాలా సినిమాలతో పోల్చితే, ఈ సినిమాలో ప్రత్యేకత అదేనేమో.!

చక్కగా.. అందంగా.. క్యూటుగా..

హీరో చక్కగా చేశాడు.. హీరోయిన్ ఇంకా చక్కగా కనిపించింది. చిన్న పిల్లలు ఎవరోగానీ, చాలా చాలా మెచ్యూర్డ్ నటనను ప్రదర్శించారు.. అదీ చాలా క్యూటుగా.!

పిల్లల నుంచి ఇంత బాగా నటనను రాబట్టవచ్చా.? అనే ఆశ్చర్యం కలగకమానదు సినిమా చూసినవాళ్ళకి.! దర్శకుడికి హేట్సాఫ్ చెప్పాలి ఈ విషయంలో.

Also Read: అ‘నిల్’ రావిపూడీ.! శ్రీలీల ఐటమ్ సాంగ్ లేదేం.?

నిర్మాణపు విలువలు బావున్నాయి. అవసరమైనమంత మేర ఖర్చుపెట్టినట్టున్నారు. అనవసరమైన ‘షో’కుల జోలికి పోలేదు.

ఎడిటింగ్ బావుంది. ఎక్కడా సాగతీత అనిపించలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా వుంది. సినిమాటోగ్రపీ.. అందమైన లొకేషన్లను బాగా ఎలివేట్ చేసింది.

వెన్నెల కిషోర్‌ని ప్రత్యేకంగా అభినందించాలి. ఫన్ జనరేట్ చేస్తూనే.. అవసరమైన చోట తనదైన టైమింగ్‌తో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు.

ఓవరాల్‌గా చూస్తే, ‘ప్రేమ విమానం’ చూడదగ్గ సినిమానే.! ఓటీటీలో అందుబాటులో వుంది గనుక, మీరూ ఓ ‘ట్రై’ ఇవ్వండి.! నచ్చుతుంది.!

– yeSBee

Digiqole Ad

Related post