Chiranjeevi Nayanthara Deepavali Celebrations.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి – నయనతార గతంలో రెండు సినిమాలకు కలిసి పని చేశారు. అందులో ఒకటి ‘సైరా’ కాగా, ఇంకొకటి ‘గాడ్ ఫాదర్’.! తాజాగా, వీరిద్దరి కాంబినేషన్లో ‘మన శంకర వర ప్రసాద్’ తెరకెక్కుతోంది.

‘మన శంకర వర ప్రసాద్’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ లిరికల్ సాంగ్ ఎంత వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక, దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, తన ఇంట్లో పలువురు సినీ ప్రముఖులకు డివోషనల్ పార్టీ ఇచ్చారు.
Chiranjeevi Nayanthara Deepavali Celebrations.. నయనతార కుటుంబ సభ్యులతో..
ఈ దీపావళి సంబరాల్లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ హీరోయిన్ నయనతార, తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం గమనార్హం.

నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్.. ప్రేమించుకుని, పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ కవలలు జన్మించారు. ఇవన్నీ తెలిసిన విషయాలే.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
ఇక, నయనతారతో చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే, చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల కోసం ఆమెకు ప్రత్యేక ఆహ్వానం వెళ్ళింది.

అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. తమ కుటుంబ సభ్యులతో చిరంజీవి ఇంట్లో జరిిన దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. మరికొందరు సినీ ప్రముఖులూ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
