న్యూస్ పేపర్‌తో గ్లామర్.! కాగితమే అందం.!
Rheena Krishna News Paper.. ఎవరీ భామ.? ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం.! ముందైతే, ఆ డ్రస్సు ఏంటి.? అన్నదాని గురించి చర్చించుకుందాం.!
కొత్తగా ఈ బ్యూటీ మాత్రమే ఈ తరహా డ్రెస్ వేసుకుందా.? లేదే, చాలామంది ఇంతకు ముందూ ఈ తరహా డ్రస్సుల్లో కనిపించారు. ఆ లిస్టులోనే చేరింది రీనా కృష్ణ (Rheena Krishna) కూడా.!
కాదేదీ గ్లామర్‌కి అనర్హం.! కాదు కాదు, కాదేదీ ఫ్యాషన్‌కి అనర్హం. అద్గదీ అసలు సంగతి. కాస్త కొత్తగా ట్రై చేసే క్రమంలో, ఇదిగో ఇలాంటి ఆలోచనలే పుట్టుకొస్తుంటాయ్.
ఎంతకీ ఎవరీ బ్యూటీ.?
ఈ భామ పేరు రీనా కృష్ణ.. ఇప్పుడిప్పుడే గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. చూస్తున్నారు కదా.. అందం.. ఒకింత ఆకర్షణీయంగానే వుందండోయ్.!
డాన్సులూ, యాక్టింగ్.. ఇవి కూడా బాగానే చేస్తుందా.? అదంతా ముందు ముందు తెలుస్తుంది. కానీ, ఈలోగా ఈ బ్యూటీ పిక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
పద్ధతిగానే కాదు.. పద్ధతి తప్పిన గ్లామరస్ ఫొటోలూ ఈ బ్యూటీకి సంబంధించినవి సోషల్ మీడియా వేదికగా. తప్పదు మరి, ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా. అదే చేస్తోంది అందాల భామ రీనా కృష్ణ (Rheena Krishna).
గ్లామరస్ ప్రపంచంలో అన్నీ వుండాలి మరి.! అన్నట్టు, న్యూస్ పేపర్ అంటే, నిజంగా న్యూస్ పేపర్ కాదు సుమీ. కాదేదీ గ్లామరుకి అనర్హం.. అని మాట్లాడుకోవాలిప్పుడు.!
క్లాత్ లేదా లెదర్ మీద న్యూస్ పేపర్ తరహా ప్రింట్ వేసి వుండడం ఈ కాస్ట్యూమ్స్ ప్రత్యేకం. ఒక్కోసారి వివాదాస్పద వార్తల్నీ ప్రింట్ చేసి.. అందాల భామలతో ధరింపజేస్తుంటారు డిజైనర్స్.