Virat Rohit Teamindia Victory.. మొదటి మ్యాచ్‌లో డకౌట్.. రెండో మ్యాచ్‌లోనూ డకౌట్.! ఇంకెందుకు ఈ వైట్ ఎలిఫెంట్.?
విరాట్ కోహ్లీ గురించి, సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శల సారాంశమిది.!
అదేంటీ, విరాట్ కోహ్లీ అంటే, ఛేజింగులో కింగ్ కదా.! టీమిండియాకి ఎన్నో విజయాల్ని అందించాడు కదా.? అలా ఎలా తీసి పారేస్తాం.? అని, కోహ్లీ అభిమానులు ఆవేదన చెందారు.
తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యాడు.. అతని మీదా దారుణమైన విమర్శలొచ్చాయి. బూతులు తిట్టారు కొందరు సోషల్ మీడియా వేదికగా.
రెండో మ్యాచ్‌కి రోహిత్ శర్మ పుంజుకున్నాడు, అర్థ సెంచరీ కొట్టాడు.! ‘ఫర్లేదులే..’ అని అప్పటిదాకా తిట్టినోళ్ళు, నోళ్ళు మూసుకున్నారు.!
Virat Rohit Teamindia Victory.. మూడో మ్యాచ్‌లో అదరగొట్టేశారు..
ఆస్ట్రేలియాతో మూడో బ్యాచ్ దగ్గరకొచ్చేసరికి, సీన్ మారిపోయింది. ఓ వైపు రోహిత్ శర్మ, ఇంకో వైపు విరాట్ కోహ్లీ.. ఇద్దరూ చెలరేగిపోయారు.!
రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు.. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ కొట్టాడు.. ఈ ఇద్దరి ధాటికి, ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేయాల్సి వచ్చింది.

సరే.. ఆట అన్నాక గెలుపోటములు సహజం. రెండో వన్డేలో టీమిండియా చాలా తప్పులే చేసింది. అదే టీమిండియా ఓటమికి కారణం.!
కాపాడుకోగలిగే స్కోరునే, టీమిండియా నిలబెట్టుకోలేకపోయింది. బౌలింగ్ తప్పిదాలు టీమిండియాకి శాపంగా మారితే, ఆస్ట్రేలియా క్యాష్ చేసుకుంది.
Also Read: తప్పతాగి అసెంబ్లీకి వెళుతున్నారా.!? డ్రంక్ టెస్ట్ తప్పనిసరి.!
ఆ సంగతి పక్కన పెడితే, విరాట్ కోహ్లీ అయినా.. రోహిత్ శర్మ అయినా.. అత్యంత గౌరవప్రదమైన క్రికెటర్లు.! కెరీర్ చివరి రోజుల్లో, వీళ్ళ మీద దారుణమైన ట్రోలింగ్ అస్సలేమాత్రం సబబు కాదు.!
కెప్టెన్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. తమదైన వ్యూహాలతో టీమిండియాకి ఎన్నో విజయాల్ని అందించారు. కొత్త ఆటగాళ్ళకు రోల్ మోడల్స్‌గా మారారు.
యంగ్‌స్టర్ కెప్టెన్‌గా వున్నా, ఈ ఇద్దరూ తమ అనుభవాన్ని రంగరించి, ఆ యంగ్స్టర్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. రిటైర్మెంట్ ఎప్పుడన్నది కోహ్లీ, రోహిత్.. తమ తమ ఆలోచనలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటారు.
ఈలోగా, సోషల్ మీడియా వేదికగా ‘పనికిమాలిన విశ్లేషణ’ అనవసరం.
