Raghu Rama Krishna Raju Chiranjeevi.. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయ్.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం.!
ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా, తన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.
రఘురామ కృష్ణరాజు సరైన సమయంలో, సరైన విధంగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగడంతో, వివాదం సద్దుమణిగిపోయింది.
Raghu Rama Krishna Raju Chiranjeevi.. భీమవరంలో పేకాట పంచాయితీ..
భీమవరంలో ఓ పోలీస్ అధికారి మీద ‘పేకాట పంచాయితీ’ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు.
పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఏపీ డిప్యూటీ సీఎం వివరణ కోరిన సంగతి తెలిసిందే. చిత్రంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి తరఫున వకాల్తా పుచ్చుకున్నారు రఘురామ కృష్ణరాజు.
దాంతో, ఏపీ డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వివాదం ముదిరి పాకాన పడ్డంతో, రఘురామ మళ్ళీ స్పందించారు.
పవన్ కళ్యాణ్ మీద తానేమీ అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదనీ, తన వద్దకు వచ్చిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించడం సబబేనని వివరణ ఇచ్చారు రఘురామ కృష్ణరాజు.
మెగాస్టార్ చిరంజీవితో..
తాజాగా, హైద్రాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పాల్గొన్న రఘురామ కృష్ణరాజు, సంబంధిత ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
‘ప్రియ మిత్రులు చిరంజీవిగారితో’ అంటూ, ఆ ఫొటోని రఘురామ కృష్ణరాజు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో, జన సైనికులూ ఒకింత శాంతించారు.
చిన్న కమ్యూనికేషన్ గ్యాప్.. ఇంత పెద్ద వివాదానికి కారణమయ్యింది. పోలీస్ అధికారికి రఘురామ కృష్ణరాజు సర్టిఫికెట్ ఇచ్చి వుండకపోతే, ఇంత వివాదం తెరపైకొచ్చేది కాదు.!
రఘురామ కృష్ణరాజు వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గ ఎంపీగా గెలిచారు. కొద్ది నెలలకే, వైసీపీకి దూరమయ్యారు.
2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు రఘురామ కృష్ణరాజు.
