Table of Contents
Sky Stadium Saudi Arabia.. భారత దేశంలో ఓ ప్రత్యేకమైన క్రికెట్ స్టేడియం వుంది. అదే ధర్మశాల క్రికెట్ స్టేడియం.
హిమాచల్ ప్రదేశ్‌లో నిర్మించారు దీన్ని. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టేడియం నిర్మాణం జరిగింది.
విపరీత వాతావరణ పరిస్థితులు ఇక్కడుంటాయ్. అందుకే, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు మాత్రమే ధర్మశాల స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుంటుంది.
ఓ విమానాశ్రయం సముద్రంలో నిర్మితమయ్యింది. అదొక ఇంజనీరింగ్ అద్భుతం. కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అది.
Sky Stadium Saudi Arabia.. ఇంజనీరింగ్ అద్భుతాలే అన్నీ..
మంచు కొండల్లో అత్యంత ఎత్తున భారతీయ రైల్వే అద్భుతమైన బ్రిడ్జిని నిర్మించింది. ఇది కూడా ఇంజనీరింగ్ అద్భుతమే.
రామేశ్వరం అనే ద్వీపాన్ని భారతదేశంతో కలిపే ‘సీ లింక్ రైల్వే బ్రిడ్జ్’ కూడా ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువుటద్దం.
చెప్పుకుంటూ పోతే ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఎన్నో అద్భుతాలున్నాయ్. ముఖ్యంగా ఎడారి దేశాల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ అద్భుతాలు మనకి కనిపిస్తుంటాయ్.
ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా సముద్రంలోనే ‘పామ్ ఐలాండ్స్’ అనే అద్భుతాన్ని సృష్టించిందక్కడ. తాజాగా సౌదీ అరేబియా మరో ఇంజనీరింగ్ అద్భుతానికి శ్రీకారం చుట్టింది.
ఆకాశమే హద్దు..
నేల మీద నుంచి దాదాపు 350 మీటర్ల ఎత్తున ఓ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఐదేళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారట.
ఫుట్‌బాల్ మైదానాన్ని అంత ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిర్మాణం అంతా రెన్యువబుల్ ఎనర్జీతో రూపొందిస్తారు.
దాదాపుగా 40 వేల మంది ప్రేక్షకులు ఈ మైదానంలో ఫుట్‌బాల్ పోటీల్ని తిలకించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారట.
భవనంలో పార్కింగ్ సహా రెస్టారెంట్లు.. ఇతరత్రా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ చాలానే వుండబోతున్నాయట.
భద్రత పరంగా రాజీ లేదు..
భద్రత పరంగా ఏమాత్రం రాజీపడకుండా ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని అందుబాటులోకి తీసుకువస్తారట.
ఒక బిలియన్ డాలర్లు ఈ నిర్మాణం కోసం ఖర్చు చేయబోతున్నారు. దీన్ని ‘స్కై స్టేడియం’గా అభివర్ణిస్తున్నారు.
Also Read: బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
అరబ్ దేశాల్లో ఆకాశ హార్మ్యాలు కొత్తేమీ కాదు. అయితే ఎప్పటికప్పుడు తమ రికార్డుల్ని తామే కొల్లగొడుతూ సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయ్ అరబ్ దేశాలు.
అందుకే, పర్యాటకం అరబ్ దేశాల్లో ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది.
