Pawan Kalyan Cyclone Montha.. పిఠాపురం ఎమ్మెల్యే, జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తుపాను పరీక్షలో నెగ్గారు.!
అయినా, తుపాను పరీక్షలో నెగ్గడమేంటి.? అంటే, ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకోవడంలో విజయం సాధించారని అర్థం.!
పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర తీరం, ఆ సముద్ర తీరాన.. మత్య్సకార జనాభా.. తుపాన్ల వేళ, ఆ మత్స్యకార జనాభా విలవిల్లాడటం దశాబ్దాలుగా చూస్తూనే వున్నాం.
తుపాన్లు అంటే, ప్రకృతి విపత్తులే.! సముద్రంలోంచి భూమ్మీదకి రాకాసి మేఘాలు, గాలులు విరుచుకుపడుతుంటాయి. తీరం పోటెత్తుతుంది తుపాన్ల వేళ.
Pawan Kalyan.. ఉప్పాడకి రక్షణగా..
ఉప్పాడ ప్రాంతం, తుపాన్ల వేళ అల్లకల్లోలంగా మారిపోతుంటుంది. ఊళ్ళ మీదకి సముద్రం ఉప్పొంగేస్తుంటుంది.
ఈ క్రమంలో, ఉప్పాడకు ‘కోత’ నుంచి ఉపశమనం కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
కేవలం ఉప్పాడ తీర ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వున్న తీర ప్రాంతానికి రక్షణగా, చెట్లను పెంచే కార్యక్రమానికి ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

‘గ్రీన్ వాల్’ అంటూ ఓ బృహత్తర ప్రాజెక్టుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తీరాన్ని సముద్రం నుంచి దూసుకొచ్చే విపత్తుల్ని అడ్డుకునేవి చెట్లే.
కొన్ని ప్రత్యేకమైన వృక్ష జాతులు, తీరానికి సముద్రపు ఆటుపోట్లు, తుపాన్లు, సునామీల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.
దశాబ్దాలుగా వృక్ష జాతుల పెంపకం విషయమై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. పైగా, అభివృద్ధి పేరుతో వాటిని తొలగిస్తూ వచ్చాయి.
ఇక, తాజాగా ‘మోంథా’ తుపాను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకుపడగా, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం వుంటుందని ముందస్తుగా హెచ్చరించారు.
జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం..
దాంతో, తమ ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిథుల్ని, నాయకుల్ని అప్రమత్తం చేసి, తీర ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అనునిత్యం, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, పరిస్థితిని మానిటర్ చేస్తూ వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. తుపాన్ల వేళ, ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని తరలించడమే పెద్ద టాస్క్ ప్రభుత్వానికి.
ఈ క్రమంలో, ఇంటింటికీ వెళ్ళి, ప్రజలకు నచ్చజెప్పి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పవన్ కళ్యాణ్, అధికారుల్ని, ప్రజా ప్రతినిథుల్ని గైడ్ చేసిన వైనం అభినందనీయం.
‘ఇంతకుముందెన్నడూ ఇంత బాధ్యతాయుతమైన పాలనని మేం చూడలేదు..’ అంటూ, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వ్యాఖ్యానించారు.
తుపాన్లు.. వంటి ప్రకృతి విపత్తుల వేళ, ఆస్తి నష్టాన్ని నివారించలేం. కానీ, ప్రాణ నష్టాన్ని తగ్గించగలం, నివారించగలం.
పిఠాపురం నియోజకవర్గం సహా, రాష్ట్ర వ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో, ప్రభుత్వ పని తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎక్కడ విన్నా, ‘తుపాను పరీక్షలో పవన్ కళ్యాణ్ నెగ్గారు.. మమ్మల్ని కాపాడారు’ అన్న మాటే వినిపిస్తోంది, తుపాను ప్రభావిత ప్రజల నుంచి.
