Jemimah Rodrigues Team India.. క్రికెట్ అంటే, మగాళ్ళకి మాత్రమే.! కానీ, అది ఒకప్పుడు.! గత కొంతకాలంగా, క్రికెట్లో మహిళామణులూ అదరగొట్టేస్తున్నారు.!
ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటుంటాం, స్త్రీ గురించి.! చెప్పడానికి ఇలాంటి మాటలు బాగానే వుంటాయిగానీ, ఆచరణలో మహిళల్ని ప్రోత్సహించడం అనేది అరుదు.!
మైదానంలో, మహిళా క్రికెటర్లు ఎంత బాగా ఆడినా, వాళ్ళ మీద ట్రోలింగ్ సహజమే. బాడీ షేమింగ్ అనేది ఓ రోగం ఇక్కడ.!

సెలక్షన్స్ దగ్గర్నుంచి, ప్రతి విషయంలోనూ మహిళా క్రికెటర్లు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటుంటారు. అవమానాల్ని అధిగమించి, నిలదొక్కుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు.
Jemimah Rodrigues Team India.. జెమీమా.. ఓ సంచలనం..
మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ సహా ఎందరో క్రికెటర్లు తమదైన గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ కోవలోకే చేరుతుంది జెమీమా రోడ్రిగ్స్.
ఆస్ట్రేలియాతో జరిగిన విమెన్స్ వరల్డ్ కప్ పోటీల్లో, అందునా సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ ఆడిన ఇన్నింగ్స్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఓ వైపు విపరీతమైన అలసట వేధిస్తోంది.. ఇంకో వైపు, భారీ లక్ష్య చేదనలో ఒత్తిడి పెరుగుతోంది.. అయినా, ఏకాగ్రత అస్సలేమాత్రం కోల్పోలేదు జెమీమా రోడ్రిగ్స్.
జెమీమా మాత్రమే కాదు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహా, మిగతా బ్యాటర్లూ సత్తా చాటారు. హర్మన్ ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ అయితే, వేరే లెవల్.
నరాలు తెగే ఉత్కంఠ.!
తక్కువ పరుగులే చేసినా, రిచా కొట్టిన సిక్సర్లు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మని గుర్తు చేశాయి. 330కి పైగా పరుగులు, అదీ ప్రపంచ కప్ పోటీల్లో.. ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఆషామాషీ విషయం కాదు.
పురుషుల క్రికెట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే, ఎలాంటి ఉత్కంఠ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకు మించిన ఉత్కంఠ మహిళా క్రికెట్లోనూ చూశాం.

లక్ష్యానికి నాలుగు పరుగులే కావాల్సిన సమయంలో, బలంగా బంతిని బౌండరీకి భారత బ్యాటర్ తరలించే ప్రయత్నం చేస్తే, అత్యద్భుతమైన ఫీల్డింగ్‌తో రెండు పరుగులే వచ్చేలా చేసింది ఆసీస్ ఫీల్డర్.
Also Read: బుర్రలు బద్దలాసుపోయే ప్రశ్న: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత.?
ఇదొక్కటి చాలు, మ్యాచ్ ఎంత ఉత్కంఠగా జరిగిందో చెప్పడానికి. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు, చివరి దాకా టైటిల్ కోసం పోరాడారు.
మన మహిళా క్రికెటర్లు అయితే, ‘శివంగి’ అవతారమే ఎత్తేశారు.! బౌలర్లు ఫెయిలయినా, బ్యాటర్లు మాత్రం సత్తా చాటారు. మరీ ముఖ్యంగా జెమీ రోడ్రిగ్స్.. ఈమె గురించి చరిత్ర చాలా చాలా చెప్పుకుంటుంది.

మ్యాచ్ గెలిపించిన అనంతరం, జెమీమా బోరున ఏడ్చేసింది. జట్టులోకి రావడానికి ఆమె పడ్డ కష్టమే అందుక్కారణం.
జెమీమా మాత్రమే కాదు, మిగతా ఆటగాళ్ళూ.. కంటతడి పెట్టేశారు.. అవన్నీ వాళ్ళ ఆనంద భాష్పాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కదా మరి.! ఛేదనలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
