ఐపీఎల్ 2025: ఈ పండగ సంబరాలు వేరే లెవల్.!

IPL 2025

IPL 2025 Mudra369 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఆ కిక్కే వేరప్పా.! అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఐపీఎల్ సీజన్లు నడుస్తుంటాయ్.!

కొత్త సీజన్ షురూ అయ్యింది. చెన్నయ్ సూపర్ కింగ్స్ హుషారు, ముంబై ఇండియన్స్ జోరు, ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఆర్‌సీబీ.. ఇలా ఒక్కో జట్టుదీ ఒక్కో టైపు కసి.!

ధోనీ కోసం, విరాట్ కోహ్లీ కోసం.. అలాగే రోహిత్ శర్మ కోసం.. అంతేనా, విదేశీ క్రికెటర్ల కోసం కూడా. కేన్ మామ ఆడుతోంటే, అతన్ని సపోర్ట్ చేసే అభిమానులు కోకొల్లలు.

అప్పుడు ప్రత్యర్థులు.. ఇప్పుడు మన ఫేవరెట్లు..

అంతర్జాతీయ క్రికెట్‌లో మనకి ఎవరైతే శతృవులని అనుకుంటామో, ఆ ఆటగాళ్ళే ఇప్పుడు ఐపీఎల్‌లో స్టార్లు.. మన హీరోలు కూడా.! అదే ఐపీఎల్ మజా అంటే.!

బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. అంటే, అదీ ఐపీఎల్ ప్రత్యేకత. ఇంట్లో టీవీల్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఐపీఎల్ క్రికెట్ ముచ్చట్లే.

సినిమా థియేటర్లలో, సినిమాలకు కలెక్షన్లు రాకపోతే.. ఆ సినిమా స్థానంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలు చాలానే.

గ్లామరస్ క్రికెట్..

ఇది కాక, కొన్ని స్పెషల్ మ్యాచ్‌ల కోసం థియేటర్లు ప్రత్యేకంగా ముస్తాబవుతుంటాయి. అదీ ఐపీఎల్ మేనియా అంటే. పెద్ద సినిమాలే, ఐపీఎల్ సీజన్‌లో విడుదలయ్యేందకు భయపడటం మరో ఆసక్తికరమైన అంశం.

గ్యాలరీల్లో సినిమా తారల హంగామా.. మైదానంలో క్రికెటర్ల హంగామా.. వెరసి, మోస్ట్ గ్లామరస్ క్రికెట్.. అంటే, అది ఐపీఎల్ మాత్రమేనేమో.!

మీ కోసం.. మ్యాచ్ ముందర ముచ్చట్లు.. మ్యాచ్ తర్వాత విశేషాలు.. అన్నీ ఇక్కడే.! అస్సలు మిస్సవ్వొద్దు.!

hellomudra

Related post