Telangana Minister Mohammad Azharuddin.. మొహమ్మద్ అజారుద్దీన్.. క్రికెట్ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరిది.!
సూపర్బ్ బ్యాట్స్‌మెన్.. అత్యద్భుతమైన ఫీల్డర్.. అంతకు మించి టీమిండియాకి మంచి విజయాల్ని అందించిన కెప్టెన్.!
ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి తన వైపుకు వస్తే, చాలా సులువుగా పట్టేసుకుని, వికెట్ల మీదకి అత్యంత ఖచ్చితత్వంతో గిరాటేసేవాడు అజారుద్దీన్.
బ్యాట్ పట్టుకున్నాడంటే, బౌలర్ విసిరిన బంతిని చాలా చాలా అందంగా బౌండరీకి తరలించగల సత్తా వున్న ‘మణికట్టు’ మాంత్రికుడు మొహమ్మద్ అజారుద్దీన్.
Telangana Minister Mohammad Azharuddin.. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని..
దురదృష్టం ఏంటంటే, మంచి సక్సెస్ ట్రాక్ వున్న కెప్టెన్‌గా గుర్తింపు పొందిన అజారుద్దీన్, అనూహ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు.
సుదీర్ఘకాలంపాటు భారత జట్టుకి సేవలందించిన అజారుద్దీన్ కెరీర్, మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ముగియడాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేరు.

క్రికెట్ వదిలేశాక, కొంతకాలం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అజారుద్దీన్. స్వరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ (అప్పటికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్) కాకుండా, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాడు.
యూపీలోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, లోక్ సభకు ఎన్నికైన అజారుద్దీన్, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు.
వివాదాలు.. రాజకీయాలు..
మద్యలో, హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలు, ఈ క్రమంలో వివాదాలు.. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అసెంబ్లీకి పోటీ చేయాలని గత ఎన్నికల్లో ప్రయత్నించి విఫలమయ్యాడు అజారుద్దీన్.
జూబ్లీహిల్ ఉప ఎన్నిక సమయంలో, అజారుద్దీన్‌ని మంత్రిగా చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పొలిటికల్ మూవ్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Also Read: కామెడీ కాదు, ‘కామమ్ ర్యాంప్’.!
అజారుద్దీన్ మంత్రి అయితే, అది కాంగ్రెస్ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుందా.? ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లో అజారుద్దీన్ చక్రం తిప్పుతారా.?
క్రికెట్ విషయానికొస్తే, 99 టెస్టులు ఆడిన అజారుద్దీన్, 300కి పైగా వన్డేలు ఆడటం గమనార్హం.
