Kumbhamela Monalisa Telugu Cinema.. కుంభమేళా మోనాలిసా గుర్తుందా.?
అదేనండీ, కుంభమేళా సమయంలో పాపులర్ అయ్యింది కదా.? పూసలమ్ముకునే అమ్మాయి, ఎవరి కంటికో ఒకింత ప్రత్యేకంగా, భిన్నమైనదిగా కనిపించింది.!
మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి కళ్ళు.. బాగా ఎట్రాక్ట్ చేశాయి. అంతే, ఆ పూసలమ్ముకునే అమ్మాయి, రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయింది.
ఎంతలా పాపులర్ అయ్యిందంటే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూ ట్యూబ్ ఛానళ్ళ నిర్వాహకులు.. కుంభమేళా కంటే ఎక్కువగా, ఆమె దర్శనం కోసం బారులు తీరారు.
ఆ దెబ్బకి, తన పూసల వ్యాపారం కూడా చేసుకోలేక, కంటతడి పెట్టిందా అమ్మాయి.! అయితేనేం, పాపులారిటీ వచ్చింది.. సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయి.
Kumbhamela Monalisa Telugu Cinema.. పూట గడవడానికే ఇబ్బంది పడేంత పేదరికం నుండి..
పూట గడవడానికి కూడా ఇబ్బంది పడేంత పేదరికం నుంచి, ఈ పాపులారిటీ ఆమెను కాస్త ఒడ్డున పడేసింది. కొందరు డబ్బులు ఇచ్చి, ఆమెని ఇంటర్వ్యూలు చేశారు.
ఆర్థికంగా కాస్త కుదురుకుంది. కానీ, సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి కొందరు మొహం చాటేశారు. అయితేనేం, ‘మోనాలిసా’ అనే పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది.
‘కుంభమేళా మోనాలిసా’ అంటే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడామె, తెలుగు సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చేసింది.
తాజాగా, కుంభమేళా మోనాలిసా ఓ తెలుగు సినిమాకి ‘సైన్’ చేసింది. ఆ సినిమా ప్రారంభోత్సవంలో, తనకు తెలుగు రాదనీ.. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాననీ చెప్పింది మోనాలిసా.
తెలుగు నేర్చుకుంటుందిట..
నిజానికి, మోనాలిసా చదువుకోలేదు. వారి సంప్రదాయ భాష తప్ప, వేరే భాషలేమీ రావు. కాస్త హిందీ వచ్చు. కుంభమేళాతో పాపులర్ అయ్యాక, కొంచెం కొంచెం ఇంగ్లీషు కూడా నేర్చుకుంది.
ఏదిఏమైతేనేం.. పూటగడవడానికి కూడా కష్టపడే ఓ అమ్మాయి, సోషల్ మీడియా పుణ్యమా అని.. ఆర్థికంగా నిలదొక్కుకుంది. ‘
పూసలమ్ముకునే అమ్మాయి’ అని తక్కువగా చూడాల్సిన పనిలేదు. ఆమె కష్టపడి ఆ పని చేసింది. సినిమాలు కలిసొస్తే మంచిదేగా.!
కానీ, గ్లామరస్ ప్రపంచంలో ఎందరో తారలు, తెరమరుగైపోయారు.. సక్సెస్‌లు దొరక్క. అదే సమయంలో, అనూహ్యంగా కొందరు స్టార్లు అయ్యారనుకోండి.. అది వేరే సంగతి.
