Pawan Kalyan Telangana Warning… ‘పవన్ కళ్యాణ్ సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వం’ అంటూ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించేశారు.!
మాజీ మంత్రి, గులాబీ పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డి కూడా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ సమాజానికి’ అంటూ అల్టిమేటం జారీ చేశారు.
ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇంకో కాంగ్రెస్ మంత్రి, మరో కాంగ్రెస్ ఎంపీ.. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరొకరుగా, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో కొందరు ఆకతాయి గులాబీ కార్యకర్తలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే.
చాలా సినిమాల్ని ఈ ఆకతాయిలు బెదిరించడం, ఆయా సినిమాలు కొంత మేర ఇబ్బంది పడటం తెలిసిన విషయాలే.!
‘ఆంధ్రోళ్ళు దొంగోళ్ళు.. లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. సీమాంధ్రలో పుట్టినోళ్ళంతా తెలంగాణ ద్రోహులే..’ ఇలాంటి మాటలు తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో విన్నాం.
ఇప్పటికీ, ఇవే మాటలు వింటూనే వున్నాం. సీమాంధ్ర మీద విషం చిమ్మకపోతే, తెలంగాణలో రాజకీయం చేయలేని భావదారిద్ర్యం, తెలంగాణ రాజకీయ నాయకుల్లో చాలామందిది.
ఉద్యమం ముసుగులో, సీమాంధ్ర మీద తెలంగాణ నాయకులు చేసిన చాలా అభ్యంతకర వ్యాఖ్యల్లో, కోనసీమ పచ్చదనం కూడా ఇబ్బందులు పడింది.
ఆ విషయాన్నే ఇటీవల, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించిన సందర్భంగా ప్రస్తావించారు. అది కూడా లైటర్ నోట్‌లో.!
కోనసీమ కొబ్బరికి కొందరు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో.. అని మాత్రమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కోనసీమ రైతుల మాటల్ని ప్రస్తావించారు.
దాంతో, తెలంగాణ నాయకులు కొందరు, ఆ మాటల్లో అసలు అర్థమేంటో తెలుసుకోకుండానే మీడియా ముందుకొచ్చి, సిల్లీగా వార్నింగులు ఇచ్చుకుంటూ పోతున్నారు.
కోవిడ్ సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సాయం అందించింది పవన్ కళ్యాణ్.!
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని ఓవరాక్షన్ చేస్తున్న నాయకులు, తమ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏమైనా విరాళాలు ఇచ్చారా.? లేదే.!
పవన్ కళ్యాణ్ అప్పుడూ ఈ తాటాకు చప్పుళ్ళకు బెదరలేదు.. ఇప్పుడూ బెదరడంలేదు. ఇకపైనా బెదిరిపోయే ప్రసక్తే లేదు.!
తెలంగాణలో జన సేన పార్టీ బలోపేతం దిశగా, జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.
‘కాంగ్రెస్ నేతల పంచెలూడగొడతాం’ అని ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తుకు తెచ్చుకుని, తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు, గులాబీ నేతలూ భయపడుతున్నారేమో.!
