BiggBossTelugu9 Queen Thanuja Kannada.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కదా.! మరి, కన్నడ కంటెస్టెంట్లు ఎందుకు.?
అయినా, ఇదేం వింత వాదన.? మన తెలుగమ్మాయ్ బిందు మాధవి, తమిళ బిగ్ బాస్ షో చేసింది కదా.? బిందు మాధవి సరే, ఇంకెంతమంది తెలుగు కంటెస్టెంట్లు, ఇతర భాషల్లో బిగ్ బాస్ చేశారట.?
ప్చ్.. పెద్దగా లేరు.! ఎందుకు.? అదంతే.! కానీ, తెలుగు బిగ్ బాస్ తీసుకుంటే, కన్నడ కంటెస్టెంట్లు చాలా ఎక్కువమందే కనిపిస్తున్నారు.!
ప్రస్తుతం నడుస్తున్న సీజన్లో అయితే తనూజతోపాటు సంజన కూడా కన్నడ నుంచి వచ్చిందే.! అంతకు ముందు సీజన్లో మరీ దారుణం. ఏకంగా నలుగురు కంటెస్టెంట్లు కన్నడ నుంచి వచ్చారు.
సహజంగానే, కన్నడ ఓటర్లు తెలుగు బిగ్ బాస్ షో కంటెస్టెంట్లలో తమ కంటెస్టెంట్లకే ఓట్లు వేసుకుంటారు. అది కన్నడ కంటెస్టెంట్లకు పెద్ద అడ్వాంటేజ్.
తెలుగు ఓట్లు ఎలాగూ డివైడ్ అయిపోతాయ్.! ఈ సీజన్లో సంజన – తనూజ మధ్య కన్నడ ఓట్లు.. అటూ, ఇటూ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి.
నిజానికి, తనూజ స్ట్రాంగ్ కంటెస్టెంట్.! ఆమె క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు తొమ్మిదో సీజన్ కోసం బిగ్ బాస్.! సంజన విషయంలోనూ కొన్ని రిజర్వేషన్స్ పనిచేస్తున్నాయి.
తెలుగు కంటెస్టెంట్లని తీసుకుంటే, భరణి అలాగే పవన్, రీతూ.. ఇలా అందర్నీ వేరే కంటెస్టెంట్లకు డిపెండెంట్లుగా బిగ్ బాస్ మార్చేశాడు.!
ఇమ్మాన్యుయేల్ కూడా కొన్నాళ్ళపాటు సంజన మీద డిపెండ్ అయ్యే కంటెస్టెంట్లానే వున్నాడు. కానీ, ఆ తర్వాత కథ మారింది. నిజానికి, తనూజతో పోల్చినా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్.
కమెడియన్ కదా.. సీజన్ విన్నర్‌గా అతన్ని బిగ్ బాస్ ఎంచుకోకపోవచ్చు. తనూజకి టైటిల్ కన్ఫామ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.!
