Ys Jagan Bokkalo Rajakeeyam.. బెంగళూరు నుంచి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వారం వారం.. వీలు చూసుకుని, బెంగళూరు నుంచి విజయవాడకి చేరుకుని, ఓ రెండ్రోజులు తాడేపల్లి ప్యాలెస్‌లో రెస్ట్ తీసుకుని, తిరిగి బెంగళూరు వెళ్ళిపోతుంటారు జగన్.
అక్కడ బెంగళూరులో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని, తిరిగి మళ్ళీ విజయవాడకు వస్తుంటారు. షటిల్ సర్వీస్ అన్నమాట.! ఇదో టైపు రాజకీయం.!
సరే, వచ్చారు.. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవ్వాలి కదా.? అయ్యారు.! ప్రజలతోనూ మమేకమవ్వాలి కదా.. పార్టీ కార్యాలయానికి జనాల్నీ రప్పించుకున్నారు.
Ys Jagan Bokkalo Rajakeeyam.. చిత్ర విచిత్రమైన ప్రెస్ మీట్..
చిత్ర విచిత్రమైన ప్రెస్ మీట్ ఒకటి పెట్టాలి కదా.? ఆ ముచ్చట కూడా తీర్చుకున్నారు.! రాజకీయ విమర్శలు చేయాలి కదా.. అవీ చేశారు.!
‘చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా.?’ అంటూ ఒకింత నోరు జారారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సరే, అదీ సమర్థనీయమే అనుకుందాం.!
‘బొక్కలో..’ అంటూ, నోరు జారడమేంటి.? ఇక్కడ బొక్కలో.. అనగా, జైల్లో.. అని వైఎస్ జగన్ ఉవాచ.! ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి, చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలట.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురి మీదా 420 కేసులు పెట్టి, బొక్కలో వెయ్యాలి.. అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.
ఎవర్ని బొక్కలో వెయ్యాలి జగన్.?
మద్య నిషేధంపై 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా చీటింగ్ కేసు పెట్టి, బొక్కలో వెయ్యొచ్చా.? కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాస్త ఆలోచించాలి ఈ విషయాన్ని.
‘బొక్కలో’ అన్న పద ప్రయోగం అత్యంత అసభ్యకరం.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహన రాజకీయం.. ఇక్కడ సుస్పష్టం.!
గతంలో, ‘కార్లు.. పెళ్ళాలు..’ అంటూ పసి పిల్లలు పాల్గొన్న అధికారిక బహిరంగ సభల్లో వైఎస్ జగన్ నోరు జారడం చూశాం. అలాంటి జగన్ నుంచి, సంస్కార వంతమైన పదజాలాన్ని ఆశించలేం.!
అందుకే, ‘బొక్కలో’ అనే పదాన్ని నిజానికి, ఇలా ప్రస్తావించుకోవడం బాధాకరమైనా.. ఈ బొక్కలో రాజకీయాన్ని ప్రశ్నించకుండా వుండలేకపోతున్నాం.!
ఇదే బొక్కలో రాజకీయాన్ని వైఎస్ జగన్ కొనసాగిస్తే, గతంలో 151 కాస్తా 11 అయినట్లు, ముందు ముందు ‘1’ సీటుకి వైసీపీ పరిమితమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.!
