Balayya Akhanda2 Flop Show.. ఈ రోజుల్లో చిన్న సినిమాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీమియర్ షోలు పడుతున్నాయ్.!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని ఒప్పించి మరీ, ప్రీమియర్ షోల కోసం టిక్కెట్ ధరల పెంపు రాబట్టింది ‘అఖండ-2’ టీమ్.
కట్ చేస్తే, ప్రీమియర్స్ పడలేదు. టెక్నికల్ ఇష్యూస్.. అంటూ, చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్టేట్మెంట్ సోషల్ మీడియా వదిలింది.!
అప్పటిదాకా ప్రీమియర్స్‌తోనే గత రికార్డులు కొల్లగొట్టేస్తాం.. అంటూ, సోషల్ మీడియా వేదికగా హంగామా చేసిన నందమూరి బాలకృష్ణ అభిమానులు, ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
Balayya Akhanda2 Flop Show.. బాలయ్య ఎక్కడ.? ఏం చేస్తున్నారు.?
ఇంతకీ, నందమూరి బాలకృష్ణ ఎక్కడ.? ఏం చేస్తున్నారు.? ఈ మొత్తం వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ చేయగలిగిందేమీ లేదా.?
నిజానికి, సినిమా రిలీజ్ అంటే.. పురిటి నొప్పుల వ్యవహారంగా చూస్తారు. అంత కష్టమైన వ్యవహారమది. చాలా ఇబ్బందులుంటాయ్.
ఆర్థిక పరమైన క్లియరెన్సులు అన్నీ జరిగితే తప్ప, సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి వుండదు. ‘అఖండ-2’ సినిమాకి కూడా అదే సమస్య వచ్చి పడింది.
ఇలాంటి సమయాల్లోనే హీరోలు, నిర్మాతలకు అండగా వుండాలి. గతంలో చాలా సినిమాల విషయంలో హీరోలు, రియల్ హీరోయిజం చూపించి, నిర్మాతల్ని ఆదుకున్నారు.
బండ బూతులు తిడుతున్నారు..
ఇక్కడ ఏమయ్యిందో తెలియదు.. సినిమా ప్రీమియర్స్ ఆగిపోయాయ్. పరువు పోయింది.! అభిమానులేమో బండ బూతులు తిడుతున్నారు నిర్మాణ సంస్థని.
ప్రీమియర్స్‌కి టిక్కెట్లు సరిగ్గా తెగలేదనీ, అందుకే ప్రీమియర్స్‌ని రద్దు చేశారన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఇదే నిజమైతే, అంతకన్నా అవమానం ఇంకేముంటుంది.?
బాలయ్య అభిమానులైతే, ‘అఖండ-2’ విషయమై నిర్మాణ సంస్థ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తమ అభిమాన నటుడ్ని కూడా తూలనాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా.
కాస్సేపట్లో విదేశాల్లో ‘షో’ పడే అవకాశముంది. భారత దేశంలో మాత్రం, రేపు ఉదయమే ‘షో’ పడనుందని తెలుస్తోంది.! సినిమా రిజల్ట్ ఎలా వుంటుందో ఏమో.!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ-2’ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
