The Raja Saab Akhanda2.. అన్ని సినిమాలకీ ఒకే సమస్య వుంటుందని అనుకుంటే ఎలా.? ‘అఖండ-2’ సినిమా రిలీజ్ ఆగిపోయినట్లే, ‘ది రాజా సాబ్’ సినిమా కూడా ఆగిపోవాలనుకోవడం సబబేనా.?
తెలుగు సినీ పరిశ్రమకి ఓ వర్గం మీడియా అనేది ‘క్యాన్సర్’లా సోకేసింది.! దీన్ని మీడియా అనడం కంటే, మాఫియా అనడం సబబేమో.!
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాకి ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి, విడుదల సమయంలో. అది కూడా, నిర్మాణ సంస్థకి సంబంధించిన పాత బకాయిల వ్యవహారంతో.
ఇతరత్రా కారణాలు ఏమైనా వున్నాయా.? అన్నదానిపై నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సి వుంది.. సినిమా అన్నాక, ఇలాంటివి మామూలే.!
The Raja Saab Akhanda2.. ‘అఖండ-2’ ఆగిపోవడం బాధాకరమే.. కానీ.!
చివరి నిమిషంలో ‘అఖండ-2’ సినిమా విడుదల ఆగిపోవడం బాధాకరమే. అంత మాత్రాన, ‘ది రాజా సాబ్’ సినిమా కూడా అలాగే ఆగిపోవాలని కోరుకోవడం ముమ్మాటికీ క్షుద్ర పాత్రికేయమే.!
జరుగుతున్న దుష్ప్రచారంపై ‘ది రాజా సాబ్’ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. ‘అఖండ-2’ సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోవడం బాధాకరమన్నారు.
‘ది రాజా సాబ్’ సినిమాకి ఆర్థిక పరమైన ఇబ్బందులేమీ లేవని చెప్పారు. సినిమా నిర్మాణం కోసం వివిధ మార్గాల ద్వారా తీసుకున్న డబ్బులన్నీ క్లియర్ చేశామని చెప్పారు విశ్వ ప్రసాద్.
అంతే కాదు, వడ్డీలు కూడా త్వరలోనే క్లియర్ అయిపోతాయనీ విశ్వ ప్రసాద్ స్పష్టతనిచ్చారు ట్విట్టర్ వేదికగా.!
దాంతో, ‘ది రాజా సాబ్’ సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారమంతా ‘ఓ వర్గం మీడియా సృష్టి’ అని తేలిపోయింది.
సినిమా అంటే.. అత్యంత సున్నితమైనది..
సినిమా అత్యంత సున్నితమైన వ్యవహారం. అలాంటి సినిమా మీద రాళ్ళు విసరడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
నిజానికి, సినిమా బాలేకపోతే విమర్శలు తప్పు కాదు.! కానీ, సినిమా రిలీజ్‌కి ముందు ఈ తరహా దుష్ప్రచారాలు, సినిమాని దారుణంగా దెబ్బ తీస్తాయ్.!
సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ‘అఖండ-2’ ఆగిపోయిందన్న అక్కసుతో, ఓ వర్గం మీడియా ఇతర సినిమాలపై దుష్ప్రచారం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
