Thanuja Puttaswamy BiggBossTelugu9 Title.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్ ఎవరో, కొద్ది రోజుల్లో తేలిపోనుంది. చివరి వారం టైటిల్ పోరు ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య జరగనుంది.!
తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ.. టైటిల్ రేసులో వున్నారు. వీరిలో సంజన, పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
సంజన, తనూజ.. కన్నడ భామలు. ఇమ్మాన్యుయేల్ కమెడియన్ కాగా, కళ్యాణ్ పడాల అలానే డిమాన్ పవన్.. ఇద్దరూ సామాన్యుల్లా బిగ్ హౌస్‌లోకి వచ్చారు.
టాస్కుల్లో డిమాన్ పవన్ సత్తా చాటుతూ వస్తే, అతనికి రీతూ చౌదరితో హౌస్‌లో నడిచిన లవ్ ట్రాక్ కాస్తా, ఇబ్బందికరంగా మారింది. రీతూ చౌదరి.. ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది లెండి.!
ఇక, కళ్యాణ్ చుట్టూ ఇంట్రెస్టింగ్ పీఆర్ నడిచింది. విపరీతమైన నెగెటివిటీ కూడా కళ్యాణ్ మీద జరిగింది. సంజనకి కన్నడ ఓటర్లు గట్టిగానే సపోర్ట్ చేశారు.
హౌస్‌లో ఒకింత క్యూటుగా సందడి చేస్తూ సంజన ఎట్రాక్ట్ చేసింది. ఇమ్మాన్యుయేల్ తన కామెడీతో అలరించాడు. టాస్కుల్లోనూ ఆకట్టుకున్నాడు. నెగెటివిటీ తక్కువగానే వుందతని మీద.
తనూజ విషయానికొస్తే, ఈ సీజన్‌లో చాలా చాలా స్పెషల్ కంటెస్టెంట్. ఆమెకి బయట బీభత్సమైన పీఆర్ నడిచింది. అలా ఆమె ప్రతి వారం తనదైన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చింది.
చివరి వారంలో తనూజ చుట్టూ జరుగుతున్నంత పాజిటివ్ పబ్లిసిటీ, మిగతా కంటెస్టెంట్లెవరి మీదా జరగడంలేదు. సెలబ్రిటీలు కూడా తనూజకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
అసలు, ఇంతలా తనూజకి అనుకూలంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయంటే, వీటి వల్ల ఏం లాభం.? అదో మిస్టరీ. బిగ్ బాస్ అంటేనే, అదో గందరగోళం.
టైటిల్ తనూజదే.. అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. శివంగి తనూజ.. అని కూడా పిలుస్తున్నారామెని.! లేడీ కంటెస్టెంట్‌కి గతంలోనూ టైటిల్ దక్కింది.
కాకపోతే, అది ఓటీటీ బిగ్ బాస్.! బిందు మాధవి విన్నర్. ఈసారి తనూజకి బిగ్ బాస్ టైటిల్ దక్కితే.. విశేషమే.! కానీ, టైటిల్‌కి అన్ని విధాలా అర్హులు.. అన్న కోణంలో చూస్తే, ఇమ్మాన్యుయేల్‌కి ఇవ్వాలి.
చివరి నిమిషంలో లెక్కలేమైనా మారుతాయా.? కళ్యాణ్, పవన్, సంజన.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు టైటిల్ ఎగరేసుకుపోతారా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే.
యాభై లక్షల ప్రైజ్ మనీ, ఓ కారు.. ప్రస్తుతానికి ప్రకటించబడ్డ బహుమతులు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్ విన్నర్‌కి దక్కేవి.!
