‘బాహుబలి’ హిందీలోకి అనువాదమయ్యింది. ‘సాహో’ కూడా అంతే. ఈసారి అలా కాదు, స్ట్రెయిట్‌గానే బాలీవుడ్‌లో సత్తా చాటబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas As Adi Purush In Bollywood). ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెలుగులో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే.
తాజాగా మరో సినిమా అప్‌డేట్ వచ్చింది ప్రభాస్ నుంచి. అదే ‘ఆది పురుష్’. ఇది స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా. ‘తానాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ‘ఆది పురుష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశామనీ, ఇదొక మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ అనీ చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు.
భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దర్శకుడు ఓం రౌత్ కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడం గమనార్హం.
‘ఆది పురుష్’ బాలీవుడ్ సినిమా మాత్రమే కాదనీ, ఇది ఇండియన్ సినిమా అనీ, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మించనున్నామని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. ‘బాహుబలి’తో బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసిన ప్రభాస్, ‘సాహో’ సినిమాతో కాస్త నిరాశపర్చినా.. బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో సత్తా చాటిన విషయం తెలిసిందే.
డబ్బింగ్ సినిమాలతో కాదు, ఈసారి స్ట్రెయిట్‌గానే బాలీవుడ్‌లో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనుకుంటోన్న ప్రభాస్, ఈ సినిమాతో మరోమారు పాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌ని మరింత పదిలం చేసుకోనున్నాడన్నమాట. అన్నట్టు, ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ ఓ సినిమా నిర్మించనుంది.
అంటే, బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాతో ప్రభాస్.. అభిమానుల్ని అలరించబోతున్నాడన్నమాట రానున్న రోజుల్లో. ‘రాధే శ్యామ్’ విషయానికొస్తే ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు.